Bomb Threats : గత 24 గంటల్లో 20 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానాల్లో బాంబు బెదిరింపులు ఎవరు చేస్తున్నారు. ఇది కుట్ర లేదా తుంటరి వ్యక్తులు కావాలనే ఇలాంటి బెదిరింపు మెయిల్ లు చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రతా సంస్థలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయి. గత కొన్ని నెలలుగా ఇలాంటి బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 4 విమానయాన సంస్థలకు చెందిన 20 విమానాలకు బాంబులు పెట్టి పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ లు పంపారు. అదే సమయంలో కాంగ్రెస్ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దేశంలో విమానాలను పేల్చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. గత 5 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది పండుగల సమయం. ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవడానికి విమానాల్లో వెళుతున్నారు, అయితే ఇలాంటి బెదిరింపులు దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. గత కొన్ని నెలలుగా ఇలాంటి బెదిరింపులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. గతంలో ఆసుపత్రులు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రజలు తమ కుటుంబాల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు, కానీ మోడీ ప్రభుత్వం బెదిరింపుల పరంపరను ఆపడానికి ఎటువంటి ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ట్విట్టర్లో రాసుకొచ్చింది.
బెదిరింపు మెయిల్స్ అందుకున్న విమాన సంస్థలు.. విమానాలు
అకాసా ఎయిర్‌లైన్స్
qp 1323
1371
qp 1373
1385
qp 1405
విస్తారా ఎయిర్‌లైన్స్
UK 106
UK 27
UK 107
UK 121
UK 131
ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్
AI 101
AI 105
AI 126
AI 119
AI 161
ఇండిగో ఎయిర్లైన్స్
6E11
6E17
6E58
6E 108
6E 184
విమాన సంస్థలు ఏం చెప్పాయి?
* అక్టోబరు 19న కొన్ని విమానాలకు బాంబులు పెట్టి బెదిరించినట్లు ఆకాసా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. బెదిరింపు తర్వాత, మేము వెంటనే పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించాము . అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
* జోధ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానానికి (6ఈ 184) ముప్పు వచ్చిందని ఇండిగో ఎయిర్‌లైన్ అధికార ప్రతినిధి తెలిపారు. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న విమానానికి (6ఈ 108) బెదిరింపులు వచ్చాయి. ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నామని తెలిపారు.
* శుక్రవారం బెంగళూరు నుంచి ముంబై వెళ్లే ఆకాశ ఎయిర్ ఫ్లైట్ నంబర్ క్యూపీ 1366కి బాంబు బెదిరింపు వచ్చింది.
* ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న విస్తారా విమానాన్ని (యూకే17) బాంబు బెదిరింపుతో ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు.
* దుబాయ్ నుంచి జైపూర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఐఎక్స్-196 విమానానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.