New Year Celebrations : సరదాగా గడిపిన తర్వాత నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలిన ప్రజలు రుచికరమైన వంటకాలను ఆరగిస్తూ ముగించారు. దీంతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు కూడా బాగా సంపాదించాయి. బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలు చాలా ఆర్డర్‌లను పొందాయి. ఒక్కరోజులోనే ఈ కంపెనీల వ్యాపారం రికార్డు స్థాయికి చేరుకుంది. స్విగ్గీ ఇన్ స్టామార్ట్ సెంట్రల్ గోవాలో రూ. 70,325 అతిపెద్ద ఆర్డర్‌ను సాధించింది. న్యూ ఇయర్ సందర్భంగా బ్లింకిట్ కోల్‌కతాలో రూ.64,988 అతిపెద్ద ఆర్డర్‌ను అందుకుంది. న్యూ ఇయర్ వేడుకలు దగ్గరవుతున్నా కొద్దీ, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా రికార్డులు సృష్టించడం ప్రారంభించాయి. Zepto, Blinkit, Swiggy Instamart అధికారులు తమ రియల్ టైమ్ ఆర్డర్ గణాంకాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బ్లింకిట్ నిమిషానికి అత్యధిక ఆర్డర్లు
జొమాటో అనుబంద సంస్థ అయిన బ్లింకిట్ కూడా అత్యధిక మొత్తంలో ఆర్డర్‌లు పొందింది. నిమిషానికి, గంటకు అందిన ఆర్డర్‌ల సంఖ్యతో రికార్డులను సాధించింది. జొమాటో సహ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా మాట్లాడుతూ.. డెలివరీ పార్టనర్లు అత్యధిక ఆర్డర్లను అందుకోవడం మూలనా తన ప్లాట్‌ఫారమ్ రికార్డులు సృష్టించింది అన్నారు. మరొక సోషల్ మీడియా పోస్ట్‌లో అల్బిందర్ దిండ్సా సాయంత్రం ఐదు గంటలకు 2023 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అందుకున్న ఆర్డర్‌ల రికార్డును అధిగమించిందని రాశారు. జెప్టో సీఈవో అదిత్ పాలిచా కూడా తన ప్లాట్‌ఫారమ్‌లో ఆర్డర్‌ల సంఖ్య ఎలా పెరిగిందో సోషల్ మీడియాలో పంచుకున్నారు. గతేడాదితో పోలిస్తే జెప్టోకు 200 శాతం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి.
స్విగ్గీకి భారీ ఆర్డర్లు
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డిసెంబర్ 31 బుధవారం నాటికి అత్యధిక ఆర్డర్‌లను అందుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు. స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫన్నీ కిషన్ ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇతర పండుగలతో పోలిస్తే, మదర్స్ డే, దీపావళి సందర్భంగా వచ్చిన ఆర్డర్‌ల రికార్డులను తమ ప్లాట్‌ఫారమ్ బద్దలు కొట్టిందని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓ అమితేష్ ఝా చెప్పారు.