spot_img
Homeబిజినెస్ఈ మొక్కలతో లక్షల్లో సంపాదించే అవకాశం.. ఏం చేయాలంటే..?

ఈ మొక్కలతో లక్షల్లో సంపాదించే అవకాశం.. ఏం చేయాలంటే..?


మనలో చాలామంది గుర్రపుడెక్క మొక్కల గురించి వినే ఉంటారు. చెరువుల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగే మొక్కలలో గుర్రపుడెక్క మొక్కలు కూడా ఉన్నాయి. నీళ్లలో తేలియాడే మొక్క అయిన గుర్రపు డెక్క నీటిలోని ఆక్సిజన్ తో పాటు నీళ్లలో ఉన్న విషపదార్థాలను కూడా పీల్చుకుంటుంది. గుర్రపు డెక్క మొక్కలు ఉన్న నీటిలో చేపలు కూడా జీవించలేవు. చెరువులోని నీళ్లపై ఈ మొక్కలు కనిపిస్తే ఆ చెరువు కొన్ని రోజుల్లోనే మట్టిదిబ్బగా మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయి.

అయితే ఈ మొక్కల వల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఈ మొక్కల ద్వారా చాలామంది సులభంగా లక్షల రూపాయలు సంపాదిస్తుండటం గమనార్హం. ఈ మొక్కలతో ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు భారీ మొత్తంలో లాభాలను సంపాదిస్తున్నారు. గుర్రపుడెక్క మొక్క చెరువులో ఒకచోటు నుంచి మొదలై చెరువు అంతటా వ్యాపిస్తుంది. చేపల చెరువుల పెంపకం దారులు ఒకప్పుడు ఈ మొక్క వల్ల భారీ మొత్తంలో నష్టాలను పొందారు.

అయితే ఇప్పుడు మాత్రం గుర్రపుడెక్క మొక్కల నుంచి యోగా మ్యాట్స్ తయారు చేయడం ద్వారా ఎక్కువ మొత్తం సంపాదిస్తున్నారు. గుర్రపుడెక్క మొక్కలతో ఇతర వస్తువులను కూడా తయారు చేస్తూ పెద్ద వ్యాపార సామ్రాజాన్ని వీళ్లు సృష్టించుకుంటూ ఉండటం గమనార్హం. అస్సాం రాష్ట్రంలోని దీపోర్ బీల్ గ్రామంలో ఉన్న కొందరు బాలికలు గుర్రపు డెక్క మొక్కలతో అద్భుతాలు చేస్తున్నారు.

దీపోర్ బీల్ సరస్సు మొత్తం గుర్రపు డెక్క మొక్కలతో నిండిపోగా నార్త్ ఈస్ట్ టెక్నాలజీ అప్లికేషన్ లెర్నింగ్ సెంటర్ గుర్రపు డెక్క మొక్కల నుంచి యోగా మ్యాట్స్ తయారు చేయడానికి సంబంధించిన శిక్షణ ఇచ్చింది. ఈ మొక్కల నుంచి తయారు చేసిన యోగా మ్యాట్స్ పర్యావరణానికి కూడా ఎలాంటి హాని చేయవని తెలుస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Spain Royal Family

Spain Royal Family: స్పెయిన్‌ రాజవంశంలో కొత్త యుగం… 20 ఏళ్లకే సింహాసనం ఎక్కిన రాణి!

Spain Royal Family: స్పెయిన్‌ యూరప్‌లో చిన్న దేశం. ఇటీవల ఇరాన్‌ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం అమెరికా తీరును తప్పు పట్టింది. సైనిక స్థావరం ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వలేదు. వందల ఏళ్ల...
Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Oktelugu Epaper