Gold Price: బంగారం ధరలు భారీ షాక్ ఇచ్చాయి. ఒక్క రోజులో రూ.750 పెరిగింది. నిన్న రూ.200 పెరిగింది. అంటే రెండు రోజుల్లో దాదాపు వెయ్యి రూపాయల పెరిగడంతో ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలనుకునేవారు షాక్ తింటున్నారు.వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.
బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 3న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,450గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,760 గా ఉంది. డిసెంబర్ 2న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700తో విక్రయించారు. శనివారం కంటే ఆదివారం బంగారం ధరలు రూ.700 మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,910గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,450 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,760 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.59,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.64,530తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,450 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,760తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,450తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,760తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగా పెరిగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.80,500గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం వెండి ధరలు రూ.1000 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.80,500గా ఉంది. ముంబైలో రూ.80,500, చెన్నైలో రూ.83,500, బెంగుళూరులో 79,000, హైదరాబాద్ లో రూ.83,500తో విక్రయిస్తున్నారు.