Best Snapdragon 7 Gen 4 Phones: వివిధ అవసరాల కోసం మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు కొందరు తమకు అనుగుణంగా ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా నేటితరం వారు సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన మొబైల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా స్నాప్ డ్రాగన్ 7 Gen 4 చిప్ సెట్ మొబైల్ ఉన్న వాటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో కొన్ని ఉత్తమమైన స్నాప్ డ్రాగన్ 7 gen 4 మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో మోటరోలా ఎడ్జ్ 70, ఒప్పో రేనో 15 5జి, రియల్ మీ 16 ప్రో ప్లస్, వివో v60, రియల్ మీ పి4 ప్రో వంటివి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ మొబైల్స్ లో ఉండే ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మోటరోలా ఎడ్జ్ 70 ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో.. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 చిప్ సెట్ ఉండనుంది. ఇది 12gb రామ్ తోపాటు 5 12 జిబి స్టోరేజ్ ని కలిగి ఉంది. ఈ మొబైల్ 6.67 అంగుళాల POLED డిస్ప్లేతో ఆకర్షిస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది.50 MP మెయిన్ కెమెరా తో పాటు ఫ్రంట్ కెమెరా కూడా ఇదే పిక్సెల్ తో పనిచేసే ఈ మొబైల్ లో 4800 mAh సిలికాన్ బ్యాటరీని అమర్చారు. ఇది 15 W వైర్లెస్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. దీనిని రూ.29,999 తో విక్రయిస్తున్నారు.
OPPO కంపెనీకి చెందిన Reno 15 5G మొబైల్ కూడా స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 చిప్ సెట్ తో కలిగి ఉంది. ఈ డివైస్ 6.59 అంగుళాల LTPPS AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో 12 జిబి వరకు రామ్ పని చేయగా.. 512జిబి వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో 50 MP మెయిన్ కెమెరా పనిచేస్తుంది.50 MP పెరిస్కోప్ టెలిఫోటోను అందిస్తుంది.50 MP ఫ్రంట్ కెమెరా పనిచేస్తుంది. ఇందులో 6500 mAh బ్యాటరీ ఉండగా ఇది 80W వైర్డ్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. దీనిని రూ.45,999 తో విక్రయిస్తున్నారు.
Real me 16 Pro series 12 మొబైల్ కూడా అద్భుతమైన స్నాప్ డ్రాగన్ లో కలిగే ఉంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరాతో పాటు 50 MP సెల్ఫీ కెమెరాలు అమర్చారు. ఇది 80 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో పనిచేస్తుంది. ఇందులో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. దీనిని రూ.41,999 తో విక్రయిస్తున్నారు.
Vivo కంపెనీకి చెందిన V60 మొబైల్ సైతం స్నాప్ డ్రాగన్ జెన్ 4 తో పనిచేస్తుంది. ఈ మొబైల్లో 6.77 అంగుళాల 1.5k AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది 16 జిబి వరకు ర్యామ్, 512 GB వరకు స్టోరేజ్ తో పనిచేస్తుంది. దీనిని రూ.36,999 తో విక్రయిస్తున్నారు.