https://oktelugu.com/

Best Selling Cars: మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న కారు ఇదే..

మిడిల్ క్లాస్ రేంజ్ లో కారు కొనాలనుకునేవారు ముందుగా మారుతి కార్ల గురించి తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో మారుతికి చెందిన ఆల్టో కే 10 ను బాగా ఇష్టపడుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 25, 2024 10:47 am
    Hyundai Creta Car bes sale In 2024

    Hyundai Creta Car bes sale In 2024

    Follow us on

    Best Selling Cars: నేటి కాలంలో ఇంటింటికి కారు తప్పనిసరిగా మారింది. దూర ప్రయాణాలతో పాటు కార్యాలయాలకు 4 వెహికల్ నే వాడుతున్నారు. ఈ క్రమంలో కార్ల సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే వినియోగదారులు తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ మోడళ్లను కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు సైతం వారి అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీకి చెందిన కారు విపరీతంగా ఆదరణ పొందుతోంది. మిడిల్ క్లాస్ ఎక్కువగా దీనిని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. తక్కువ ధరతో పాటు మంచి ఫీచర్స్ ఉన్న ఈ కారు గురించి వివరాల్లోకి వెళితే..

    కార్ల దిగ్గజం మారుతి నుంచి ఎన్నో ఆకట్టుకున్న మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ కంపెనీ నుంచి లో బడ్జెట్ కార్లు ఎక్కువగా వస్తాయని చాలా మంది నమ్మకం. మిడిల్ క్లాస్ రేంజ్ లో కారు కొనాలనుకునేవారు ముందుగా మారుతి కార్ల గురించి తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో మారుతికి చెందిన ఆల్టో కే 10 ను బాగా ఇష్టపడుతున్నారు. 2024 జనవరి లో ఈ మోడల్ 12,395, ఫిబ్రవరిలో 11,723, మార్చిలో 9,332 యూనిట్లను విక్రయించుకుంది.

    మిగతా కార్ల కంటే వీటి సేల్స్ ఎక్కువగానే ఉన్నాయి. ప్రతీ నెల దాదాపు 10 వేల కార్ల వరకు విక్రయాలు జరుపుకుంటోంది. కారు వివరాల్లోకి వెళితే.. ఇందులో పవర్ విండోస్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు ABS , ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో నడిచే ఈ కారు సీఎన్ జీలో 34 కిలోమీట్ల మైలేజ్ ఇస్తుంది. చిన్న కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ వెహికల్ కోసం ఎగబడుతున్నారు.

    వివిధ వేరియంట్లలో లభించే ఈ కారు బేస్ మోడల్ రూ.3.99 లక్షల ప్రారంభ ధర ఉంది. ఎక్స్ షోరూం ధర రూ.5.96 లక్షలతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ మోడల్ సీఎన్ జీ వెర్షన్ లో రూ.6.56 లక్షలతో విక్రయిస్తున్నారు. మంచి ఫీచర్స్ తో పాటు తక్కువ బడ్జెట్ లో కారు కావాలనుకునేవారు మారుతి ఆల్టో కే 10 కోసం ఎదురుచూస్తున్నారంటే ఆశ్చర్యం లేదు.