GST: వస్తువుల కొనుగోలుపై GST అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కొందరు షాప్ వినియోగదారులు ఇష్టం వచ్చినట్లు కొన్నింటిపై అదనంగా జీఎస్టీని విధిస్తున్నారు. సాధారణంగా జీఎస్టీ విధింపుపై కొన్ని పరిమితులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయా వస్తు సేవలపై చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొందరు అదనంగా జీఎస్టీ ఛార్జీలు వేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా వినోదానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే వాటికి సంబంధించిన టికెట్లపై జీఎస్టీపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకీ అసలు విషయమేంటంటే?
నిత్యం బిజీ వాతావరణంలో గడిపే చాలా మంది వినోదాని కోసం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పట్టణాల్లో వచ్చే సర్కస్ తదితర వాటిలోకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వీటి ఎంట్రీకి ప్రత్యేక టికెట్ ఉంటుంది. ఈ టికెట్ పై కొందరు జీఎస్టీని విధిస్తున్నారు. అయితే వినియోగదారులు ఇవేమీ పట్టించుకోకుండా అదనంగా డబ్బులు చెల్లిస్తున్నారు. సాధారణంగా జీఎస్టీని చెల్లించాలన్న మాయలో పడుతున్నారు.
కానీ అన్ని సందర్భాల్లో జీఎస్టీని చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రూ.500 లోపు టికెట్ ఉంటే జీఎస్టీని అస్సలు చెల్లించొద్దు. ఏ సర్కస్ కార్యక్రమమమైనా, క్రికెట్ స్టేడియంలోకి వెళ్లడానికి తీసుకునే టికెట్ అయినా, సినీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినా జీఎస్టీని చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇవి కాకుండా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తే మాత్రం రూ.500 కంటే టికెట్ ఎక్కువగా ఉంటే వాటిపై 18 శాతం జీఎస్టీని చెల్లించాలి.
కానీ కొందరు రూ.200 టికెట్ ఉన్నా వాటిపై జీఎస్టీని విధించి వసూలు చేస్తున్నారు. అందువల్ల జీఎస్టీపై పూర్తిగా అవగాహన ఉండాలి. కొన్ని సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసేటప్పుడు సైతం ఒరిజినల్ గోల్డ్ తో పాటు మేకింగ్ చార్జిలపై కూడా జీఎస్టీని విధిస్తారు. కానీ బంగారం కొనుగోలు చేసేటప్పుడు మేకింగ్ ఛార్జీలపై జీఎస్టీని చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల జీఎస్టీని ఎక్కడ? ఎప్పుడు? చెల్లించాలో అవగాహన ఉండాలి.