Best Selling Car: కాలం మారుతున్న కొద్దీ కార్ల వినియోగం పెరిగిపోతుంది. దీంతో మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా దానిని కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య టయోటా కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ కంపెనీకి చెందిన ఓ కారు బుకింగ్ చేసుకుంటే డెలివరీ కోసం 3 నెలల వరకు ఆగాల్సిందే. మరో కారు రెండు నెలలు గడిస్తే గానీ ఇంటికి రాదు. డ్రైవర్ కు అనుగుణమైన ఇంజిన్ తో పాటు మంచి ఫీచర్స్ కలిగిన ఈ కారు మిడ్ ఎస్ యూవీ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఈ కారు పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలోని కార్ల మార్కెట్లో టయోటా కంపెనీ దూసుకుపోతుంది. ఎస్ యూవీ వెహికల్స్ ను మార్కెట్లోకి తీసుకురావడంలో ఈ కంపెనీ ముందు ఉంటుంది. అయితే మిడ్ సైజ్ ఎస్ యూవీ కారును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే అర్బన్ క్రూయిజర్ హైదర్. ఈ మోడల్ సీఎన్ జీ వేరియంట్ కారు ఇంటికి రావాలంటే 3 నెలల సమయం పడుతుంది. హైబ్రిడ్ కారు 2 నెలల వెయిటింగ్ పీరియడ్ తో రానుంది. ఈ కారు ఇంజిన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
టయోటా అర్బన్ క్రూయిజర్ హైదర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. అలాగే హైబ్రిడ్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ తో అందుబాటులో ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేసే ఈ మోడల్ ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో 5గురు సులభంగా ప్రయాణించవచ్చు. వేరియంట్ ను భట్టి 19 నుంచి 27 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీనిని 11.14 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ కారు రూ.20.19 లక్షలతో విక్రయిస్తున్నారు.
ఇక ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఛార్జర్ ఉన్నాయి. ఇప్పడు అందరూ కోరుకుంటున్న సన్ రూఫ్ ఆప్షన్ ఆకర్షిస్తుంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ తో పాటు ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి సేప్టీ ఫీచర్లు ఉన్నాయి. ఆటోమోబైల్ మార్కెట్లో అర్బన్ క్రూయిజర్ హైదర్ మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. పోటీ ఎదుర్కొంటున్న కార్లలో గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ ఉన్నాయి.