Best Mobiles Under 25000: మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ వస్తుంటాయి. కానీ వినియోగదారులు తమ బడ్జెట్ కు అనుగుణంగా మాత్రమే కొత్త ఫోన్ కొంటూ ఉంటారు. ఇటీవల ఏ మొబైల్ కొన్నా మినిమం రూ.30,000 ధర ఉంది. ప్రీమియం ఫీచర్లు కావాలంటే అదనంగా వెచ్చించాల్సిందే. అయితే మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే మొబైల్స్ రూ.25,000 లోపే ఉంటాయి. ఈ బడ్జెట్లో మొబైల్స్ మార్కెట్ లోకి వస్తే వెంటనే సేల్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ బడ్జెట్ లోపల ఉన్న బెస్ట్ మొబైల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..
Redmi Note 15 అనే మొబైల్ రూ.25 వేల లోపే కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ లో 6.7 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. స్టైలిష్ గా కనిపించే డిజైన్తో కలిగిన ఇందులో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ఉండనుంది. అలాగే హైపర్ ఓఎస్ 2 తో ఆప్టిమైజ్ ఉన్న ఈ మొబైల్ మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఉంటుంది. 108 MP మెయిన్ కెమెరా ఉండగా ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే బ్యాటరీ వ్యవస్థా కూడా మెరుగ్గా ఉంది. ఈ మొబైల్ ను రూ.22,999 తో విక్రయిస్తున్నారు.
ఆ తర్వాత నథింగ్ ఫోన్ 3a లైట్ మొబైల్ ధర రూ.21,999 గా ఉంది. ఇందులో 6.7 అంగుళాల AMOLED డిస్ప్లే చూడొచ్చు. ఈ మొబైల్ లో 50 MP మెయిన్ కెమెరా ఉండడంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి అనుగుణంగా ఉంటుంది. రోజువారి వినియోగదారులకు సైతం ఎలాంటి వాతావరణంలో నైనా అనుగుణంగా ప్రకాశవంతమైన వెలుగుని ఇస్తుంది. బ్యాటరీ పవర్ రోజంతా వినియోగించినా కూడా తగ్గకుండా ఉంటుంది.
Vivo T4 మొబైల్ ను కూడా మధ్యతరగతి ప్రజల కోసం మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 7300 mAh బ్యాటరీ ఉండగా ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. అలాగే నాణ్యమైన కెమెరా కూడా ఉండడంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి సపోర్ట్ గా ఉంటుంది. ఈ మొబైల్ ధర రూ.24,999 గా ఉంది.
నథింగ్ ఫోన్ 3a అనే మొబైల్ 2025లో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ఉన్న ప్రాసెసర్ గేమింగ్ కోరుకునే వారికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చబ్బీ డిజైన్ తో ఉండడంవల్ల చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆడియో స్పీకర్లు ఉండడంతో యూత్ ఎంజాయ్ చేస్తారు. ఈ మొబైల్ ద్వారా ప్రస్తుతం రూ.24,999 గా ఉంది.
వన్ ప్లస్ నుంచి నార్డు CE అనే మొబైల్ 7100 mAh బ్యాటరీ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీకి 80 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే రెండు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇందులో ఆల్ట్రా వైడ్ సెన్స్ కలిగిన కెమెరా ఉండడంతో పగటిపూటా సైతం అద్భుతమైన ఫోటోలను తీసుకోవచ్చు. దీనిని రూ.25,999 తో విక్రయిస్తున్నారు.
