Best Hybrid Cars In India
Best Hybrid Cars In India : భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్‌లో CNG కార్ల తరువాత, హైబ్రిడ్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రోజురోజుకి వీటి వినియోగం భారీగా పెరుగుతుంది. పెరుగుతున్న ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అనేక కంపెనీలు కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే మీరు ఈ సెగ్మెంట్లో ఏ కారును కొనాలో తెలియక తికమకపడుతున్నట్లయితే, ఫీచర్లు, మైలేజీ పరంగా అత్యుత్తమ హైబ్రిడ్ కార్ల జాబితాను ఈ కథనంలో మీ కోసం అందిస్తున్నాం. ఇది చూసి ఏ కారు కొనాలో ఆలోచించుకోవచ్చు.
1. మారుతి సుజుకి గ్రాండ్ విటారా: మారుతి సుజుకి గ్రాండ్ విటారా Zeta+ వేరియంట్‌లో బలమైన హైబ్రిడ్ ఇంజిన్ ఉంది. 1.5-లీటర్ బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో ఈ SUV 116 PS హార్స్ పవర్ విడుదల చేస్తుంది. ఈ కారులో 27.97 KMPL మైలేజీని అందిస్తుంది. కారులో 373 లీటర్ల బూట్ స్పేస్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6-ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ధర రూ.18.43 లక్షల ఎక్స్-షోరూమ్.
2. టోయోటా ఇన్నోవా హైరైడర్: ఇన్నోవా హైరైడర్, గ్రాండ్ విటారాలో ఉండే ఇంజన్‌తో వస్తుంది. ఈ కారులో e-CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఉన్నది. ఈ హైబ్రిడ్ కార్ 27.97 KMPL మైలేజీని అందిస్తుంది. ప్రారంభ ధర రూ.16.66 లక్షల ఎక్స్-షోరూమ్.
3. హోండా సిటీ హైబ్రిడ్: హోండా సిటీ హైబ్రిడ్ 1.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది e-CVTతో 126 PS పవర్, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 27.13 KMPL మైలేజీని అందిస్తుంది. హోండా సిటీ హైబ్రిడ్ రూ.19 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంటుంది.
ఈ మూడు కార్లు మీకు అద్భుతమైన మైలేజీతో పాటు అత్యాధునిక ఫీచర్లను అందిస్తాయి. మీరు వాటిలో ఏది కొనాలని నిర్ణయించుకోవాలనుకుంటే, మీ అవసరాలకు, బడ్జెట్‌కు అనుగుణంగా ఎంచుకోండి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Best hybrid cars in india these are the most selling hybrid mileage cars in our country what are their price and features
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com