https://oktelugu.com/

బ్యాంక్ అకౌంట్ తెరిస్తే 6 లక్షల రూపాయల బెనిఫిట్.. ఎలా అంటే?

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉంటారో 6 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జన్ ధన్ ఖాతా కాకుండా సాధారణ అకౌంట్ ను కలిగి ఉన్న కస్టమర్లు 4 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రధాన్ మంత్రి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 20, 2021 / 01:35 PM IST
    Follow us on

    ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉంటారో 6 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జన్ ధన్ ఖాతా కాకుండా సాధారణ అకౌంట్ ను కలిగి ఉన్న కస్టమర్లు 4 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్స్ ద్వారా ఈ బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే జన్ ధన్ ఖాతాను కలిగి ఉంటారో వారికి 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమాను పొందే అవకాశం ఉంటుంది. జన్ ధన్ ఖాతాను కలిగి ఉన్నవాళ్లకు రూపే డెబిట్ కార్డ్ లభిస్తుంది. ఈ కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటే ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబ సభ్యులు 2 లక్షల రూపాయల వరకు బీమా పొందే అవకాశం ఉంటుంది.

    జీవన్ జ్యోతి బీమా కొరకు సంవత్సరానికి 330 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ కలిగిన వ్యక్తి చనిపోతే ఫ్యామిలీ మెంబర్స్ 2 లక్షల రూపాయల బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. సురక్ష బీమా యోజన కోసం సంవత్సరానికి 12 రూపాయల ప్రీమియం చెల్లించాలి. సురక్ష బీమా యోజన తీసుకొని ప్రమాదవశాత్తూ మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయలు లభిస్తాయి.

    ఈ విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అకౌంట్ ను కలిగి ఉండటం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.