Bank Loan: సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి కల ఉంటుంది. ఇందులో భాగంగా ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకోవాలనుకుంటారు. అంతకుముందు ప్రశాంత వాతావరణంలో ఉన్న స్థలం కోసం సెర్చ్ చేస్తారు. అయితే అనువైన స్థలం దొరకగానే కొందరు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే స్థలం కొనేస్తారు. అయితే ఆ స్థలం పై కొందరు బ్యాంకు లోన్లు తీసుకొని.. ఆ విషయం చెప్పకుండా ఉంటే ఆ తరువాత స్థలం కొన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదర్కోవాల్సి వస్తుంది. స్థలం అమ్మిన వారు మళ్లీ రమ్మంటే ఇబ్బందిపెడుతారు. మరి కొనుగోలు చేయాలనుకునే స్థలం మీద బ్యాంకులోన్ ఉందో? లేదో? తెలుసుకోవడం ఎలా? అందుకు ఏదైనా వెబ్ సైట్ ఉందా?
అవును ఉంది. నేటి కాలంలో టెక్నాలజీ వృద్ధి సాధిస్తోంది. ఈ క్రమంలో ప్రతీ విషయాన్ని ఆన్లైన్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని యాప్స్ కూడా అందుబాటులోకి రావడంతో పనులు ఈజీగా చేసుకుంటున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు చేతిలో ఉన్న మొబైల్ ద్వారా తెలుసుకొనగలుగుతున్నారు. అయితే ఒక స్థలం మీద బ్యాంకులోన్ ఉన్న విషయాన్ని ఓ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..
రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సాంకేతికతను విపరీతంగా వాడుతున్నారు. స్థలం కొనుగోలు నుంచి ఇల్లు కట్టుకునేవరకు అవసరమయ్యే విషయాలన్నీ ఆన్ల్లైన్లో సమాచారం లభిస్తోంది. ఈ నేపథ్యంలో స్థలంపై బ్యాంకు లోన్ ఉన్నదీ.. లేనిదీ.. విషయాన్ని కూడా వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అదే CEARSAI. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ల్యాండ్ వివరాలను ఎంట్రీ చేస్తే ఆ స్థలంపై బ్యాంకు లోన్ ఎంత ఉంది? ఎప్పటి వరకు పే చేశారు? అనే విషయాలు తెలిసిపోతాయి.