Homeబిజినెస్Bank Hollidays: ఈ నెల బ్యాంకులు 15 రోజులే పని పని చేస్తాయి.. ఏఏ రోజు...

Bank Hollidays: ఈ నెల బ్యాంకులు 15 రోజులే పని పని చేస్తాయి.. ఏఏ రోజు మూసి ఉంటాయంటే?

Bank Hollidays: ఈ నెల (అక్టోబర్)లో బ్యాంకులకు అధికంగా సెలవులు వచ్చాయి. జాతీయ పండుగల, గాంధీ జయంతితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఆయా సంప్రదాయాలను బట్టి స్థానికంగా సెలవు ప్రకటిస్తారు. ఇవన్నీ బ్యాంకులకు సెలవు దినాలుగానే ఉంటాయి. అక్టోబర్ 2024లో బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. ఈ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ప్రధాన జాతీయ సెలవులు, ప్రాంతీయ పండుగలు, ఎన్నికల తేదీల కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబర్ 2 బుధవారం గాంధీ జయంతి, నవరాత్రి, దుర్గా పూజ, రాష్ట్ర-నిర్ధిష్ట పండుగలు వంటి అనేక ప్రాంతీయ సెలవులు అదనంగా బ్యాంకులకు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వర్తించే రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సెలవులను ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. ప్రాంతీయ ఉత్సవాలు, కార్యక్రమాలపై ఈ సెలవులు ఆధారపడి ఉంటాయి. శాఖలు మూసివేసినా.. ఆన్‌లైన్, డిజిటల్ బ్యాంక్ సేవలు కొనసాగుతూనే ఉంటాయి. కస్టమర్లు తమ ఆర్థిక వ్యవహారాలను అంతరాయం లేకుండా నిర్వహించేలా బ్యాంకులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటాయి.

ఈ వారం బ్యాంక్ సెలవులు
అక్టోబర్ 11: దసరా (మహాష్టమి/మహానవమి)/ఆయుధ పూజ/దుర్గాపూజ (దసైన్)/దుర్గా అష్టమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, పాట్నా, షిల్లాంగ్‌, రాంచీలలో బ్యాంకులు మూసివేయబడతాయి)

అక్టోబర్ 12: సెకండ్ సాటర్ డే/ దసరా (మహా నవమి/విజయదశమి)/ దుర్గాపూజ (దసైన్) (అగర్తల, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్ – ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ – తెలంగాణ, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కోల్‌కత్తా, లక్నో, నాగ్‌పూర్, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా, పనాజీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం)

అక్టోబర్ 13: ఆదివారం

అక్టోబర్ 14: దుర్గాపూజ (దసైన్)–గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.

అక్టోబర్ 17: (గురువారం): మహర్షి వాల్మీకి జయంతి/కటి బిహు – కర్ణాటక, అస్సాం మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరుపుకుంటారు.

అక్టోబరు 26: (శనివారం): జమ్ము-కశ్మీర్‌లో విలీన దినం

అక్టోబర్ 31: (గురువారం): దీపావళి (దీపావళి)–దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో జరుపుకునే ఒక ప్రధాన పండుగ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పుట్టినరోజు కూడా సూచిస్తుంది.

వీటితో పాటు, బ్యాంకులు రెండో, నాలుగో శనివారాలు (అక్టోబర్ 12, 26), అలాగే నెలలో ప్రతి ఆదివారం కూడా మూసి ఉంటాయి.

రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవులు
అక్టోబర్ లో వివిధ రాష్ట్ర-నిర్దిష్ట సెలవులు ఉంటాయి. ఉదాహరణకు, అస్సాం అక్టోబర్ 17న కటి బిహును జరుపుకోనుండగా, జమ్ము-కశ్మీర్ అక్టోబర్ 26న విలీన దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

అనేక రాష్ట్రాలు దుర్గాపూజ, దసరాను అక్టోబర్ రెండో వారంలో వేర్వేరు తేదీల్లో నిర్వహించుకుంటాయి. రాష్ట్రాల వారీగా సెలవుల పూర్తి జాబితా చూడండి..

అక్టోబర్ 11: (శుక్రవారం) మహా అష్టమి/ ఆయుధ పూజ (కర్ణాటక, ఒడిస్సా, తమిళ్‌నాడు, వెస్ట్ బెంగాల్ లో సెలవులు ఉంటాయి.)

అక్టోబర్ 12: (శనివారం): విజయదశమి/దసరా (బహుళ రాష్ట్రాల్లో).

అక్టోబర్ 31: (గురువారం) నరక చతుర్దశి/కాళి పూజ (పశ్చిమ బెంగాల్, అస్సాం, కర్ణాటక, గుజరాత్).

ఈ సెలవు దినాల్లో బ్యాంక్ శాఖలు మూసి వేసినా, కస్టమర్లు డిజిటల్ బ్యాంకింగ్ సేవల యాక్సెస్‌ కొనసాగిస్తూనే, లావాదేవీలు నిర్వహించేందుకు చెల్లింపులు చేసేందుకు, నెల పొడవునా ఇతర ఆన్‌లైన్ సేవలను సజావుగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తారు.

 

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular