సెప్టెంబర్ నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ నెల 5వ తేదీన ఆదివారం కావడంతో ఆరోజు బ్యాంకులకు సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ 8వ తేదీన శ్రీమంత శంకరదేవ తిథి కాగా గవాహటిలో ఆరోజు సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ 9వ తేదీన హరితాలిక పండుగ కావడంతో గ్యాంగ్‌టక్‌లో సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి పండుగ కావడంతో ఆరోజు కూడా సెలవు దినంగా ఉండనుంది.
సెప్టెంబర్ 11వ తేదీన రెండో శనివారం కావడంతో సెలవు దినంగా ఉండగా సెప్టెంబర్ 12వ తేదీన ఆదివారం కావడంతో బ్యాంకులు పని చేయవు. సెప్టెంబర్ 17వ తేదీన కర్మ పూజ పండుగ కావడంరో రాంచీలో సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ 19వ తేదీన ఆదివారం కాగా సెప్టెంబర్ 20వ తేదీన ఇంద్రజాత్ర కావడంతో గ్యాంగ్ టక్ లో సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ 21వ తేదీన శ్రీ నారాయణ గురు సమాధి రోజు కావడంతో కొచ్చి, తిరువనంతపురంలో సెలవు దినంగా ఉంది.
సెప్టెంబర్ 25వ తేదీన నాలుగో శనివారం సెలవు దినం కాగా సెప్టెంబర్ 26వ తేదీన చివరి ఆదివారం సెలవు దినంగా ఉండనుంది. బ్యాంక్ సెలవు దినాల్లో నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ లావాదేవీలపై అవగాహన ఉన్నవాళ్లు లావాదేవీలు జరపవచ్చు.