Banks changing Domains: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉంటాం. ఒక కంపెనీ లేదా ఒక సంస్థ తమ గురించి ప్రపంచానికి తెలియాలంటే వెబ్సైట్లో తమ గురించి సమాచారాన్ని అందుబాటులో ఉంటారు. ఇందుకోసం ఒక వెబ్సైట్ను క్రియేట్ చేస్తారు. అయితే ఈ వెబ్సైట్ చివరన ఉండే మూడు అక్షరాల పేరును డొమైన్ నేమ్ అని అంటారు. ఇది ఒక సంస్థను గుర్తుంచుకోవడానికి సులభంగా ఉంటుంది. అయితే ఇటీవల బ్యాంకులు తమ డొమైన్ లు మార్చుకుంటున్నాయి. అసలు బ్యాంకులో ఇలా డొమైన్లు మార్చుకోవడానికి కారణం ఏంటి?
అక్టోబర్ 31 లోపు బ్యాంకులు తమ డొమైన్ లు మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 21న ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహేంద్ర వంటి బ్యాంకులు తమ డొమైండ్లను మార్చుకున్నాయి. అయితే ఇటీవల ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఈ నేరాలతో బ్యాంకు ఖాతాదారులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. వినియోగదారుల బ్యాంకు ఖాతాలను తెలుసుకున్న సైబర్ మోసగాళ్లు తమ అకౌంట్ నుంచి రకరకాలుగా డబ్బులు దోచుకుంటున్నారు. అయితే వినియోగదారుడు ఎన్ని రకాలుగా ప్రైవసీ గా ఉన్నా.. కొందరు బ్యాంకుల నుంచి నేరుగా వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్నారు.
ఈ నేరాలను తగ్గించేందుకు బ్యాంకులకు సంబంధించిన వెబ్సైట్ల డొమైన్లు మార్చుకోవాలని ఆర్బిఐ ఆదేశాలు చేసింది. డొమైన్లు మార్చుకోవడం ద్వారా ఫిషింగ్, హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక సేవలపై ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పటివరకు చాలా డబ్బులు బ్యాంకు ద్వారానే సైబర్ నేరగాళ్లు దొంగిలించారు. ఇందుకు కారణం బ్యాంకులో సరైన సెక్యూరిటీ లేదని కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అయితే వినియోగదారుడి డేటా చోరీ కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా బ్యాంకులు ఇలా తమ డొమైన్లు మార్చుకోవాలని ఆర్బిఐ తెలిపింది. బ్యాంకులో తమ వెబ్సైట్లో చివరగా .bank.in అనే డొమైన్ గా వచ్చే విధంగా చూసుకోవాలని తెలిపింది.
బ్యాంకులు మాత్రమే కాకుండా ఫైనాన్స్ సంస్థలు సైతం తమ డొమైన్లు మార్చుకోవాలని పేర్కొంది. అయితే ఫైనాన్స్ సంస్థలు తమ డొమైన్లను .fin.in అని మార్చుకోవాలని అన్నారు. ఈ మార్పుల ద్వారా వినియోగదారులు తమ ఇంటర్నెట్ బ్యాంకు ఉపయోగించినప్పుడు హ్యాక్ కాకుండా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా వినియోగదారులు సైతం తమ బ్యాంకు వెబ్సైట్లను ఉపయోగించేటప్పుడు ఈ మార్పులను గమనించాలని కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అయితే కొన్ని బ్యాంకులు ఇప్పటికే .com తో కొనసాగుతున్నాయి. కానీ ఇందులో కేటగిరి సెలెక్ట్ చేసినప్పుడు .bank.in డొమైకు మారుతుందని అధికారులు చెబుతున్నారు.