Bank Loan : కాలం మారుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతున్నాయి. కానీ వాటికి తగిన ఆదాయం రావడం లేదు. ఒక్కోసారి అనుకోని ఖర్చులు వస్తుంటాయి. వీటి వల్ల రెగ్యులర్ వచ్చే జీతం సరిపోకపోగా కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో బ్యాంకులు వ్యక్తిగత లోన్లు ఇస్తుంటాయి. అలాగే ఇల్లు కట్టుకోవాలన్నా హోమ్ లోన్ సౌకర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఈ లోన్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ సంవత్సరాలు గడిచిన కొద్దీ ఈఎంఐలు అలాగే ఉండే సరికి నిరాశ కలుగుతుంది. ఇటువంటి సమయంలో లోన్ త్వరగా పూర్తి కావడంతో పాటు రూ.5 లక్షల సేవ్ చేసుకునే ఓ ట్రిక్ ఉంది. అదేంటంటే?
బ్యాంకులోన్ తీసుకునేటప్పుడు సాధారణంగా 9 శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు పైగానే ఉంటుంది. ఈ లెక్కన హోమ్ లోన్ రూ.30 లక్షలు తీసుకుంటనే జీవితాంతం కట్టాల్సి ఉంటుంది. అయితే మార్కెట్లో అదృష్టవశాత్తూ వడ్డీ రేట్లు తగ్గినా ఈ లోన్ పై తీసుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను తగ్గించరు. పైగా లోన్ తీసుకున్న తరువాత కొన్ని కొత్త బ్యాంకులు ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలో వేరే బ్యాంకు లోన్ తీసుకుంటే బాగుండు అని అనుకుంటారు.
కానీ ప్రస్తుతం తీసుకున లోన్ ను ఇతర బ్యాంకుకు కన్వర్షన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఓ బ్యాంకులో తీసుకున్న లోన్ కు 9 శాతం వడ్డీ విధిస్తే మరో బ్యాంకులో రూ.8 శాతం వడ్డీకి ఇస్తామంటే వెళ్లి ఆ బ్యాంకుకు మారవచ్చు. అయితే ఇలా మారడానికి కన్వర్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ.2000 నుంచి రూ.6000 వరకు ఉండొచ్చు. ఇలా ఎక్కువ వడ్డీ నుంచి తక్కువ వడ్డీ విధించే బ్యాంకుకు మారడం వల్ల కనీసం రూ.5 లక్షల వరకు సేవ్ చేసుకోవచ్చు.
అయితే ఇలా కన్వర్షన్ పెట్టుకున్నారని ప్రస్తుత బ్యాంకు వారికి తెలియగానే వారు కూడా ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. గుడ్ కస్టమర్ ను వారు వదులుకునే అవకాశం ఉండదు. ఈ లెక్కన ఉన్న బ్యాంకులోనే తక్కువ వడ్డీతో లోన్ చెల్లించే ఆస్కారం ఉంటుంది. అందువల్ల లోన్ పేమెంట్ త్వరగా పూర్తి కావాలంటే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి..