EMI: ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి ఇతరుల వద్ద అప్పు చేసేవారు. దీంతో కొన్ని రోజులపాటు వారు డబ్బులు అందించేవారు. అయితే ఆ తర్వాత దీనిని కొందరు వడ్డీతో సహా ఇచ్చి వ్యాపారం నిర్వహించుకునేవారు. క్రమంగా ఇప్పుడు బ్యాంకులు కూడా రుణాలు అందిస్తున్నాయి. అయితే గతంలో కంటే ఇప్పుడు బ్యాంకు రుణాలు చాలా సులభంగా అందిస్తున్నాయి. ఒక వ్యక్తి యొక్క బ్యాంకు ఖాతా క్లియర్ గా ఉంటే బ్యాంకులో ఏమాత్రం ఆలోచించకుండా రుణ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇవి కూడా కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ వడ్డీ రేటును విధిస్తున్నాయి. అయితే మరికొన్ని బ్యాంకులు మాత్రం వివిధ ఆఫర్లు చూపి వినియోగదారులను ఎక్కువ లోన్లు తీసుకునేలా చేస్తున్నాయి. ఇలా తీసుకున్న తర్వాత వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ తర్వాత EMI లు కట్టలేక ప్రాణాలు కూడా తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి? ఈ అప్పుల కూపి నుంచి ఇలా బయటపడాలి?
ఒక బ్యాంకు రుణం ఇస్తుందంటే ఏ వినియోగదారుడైన తీసుకోవడానికి వెనుకాడరు. ఎందుకంటే ఒకేసారి లక్ష నుంచి పది లక్షల మొత్తం ఇచ్చేసరికి వెంటనే తీసుకుంటారు. అయితే ఆ తర్వాత నెలనెలా వాటిని చెల్లించే సమయంలో మాత్రం తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి కనీసం మూడో లేదా నాలుగు సంవత్సరాల పాటు నెల కట్టాల్సి వస్తుంది. ఇలా కట్టడం వల్ల మిగతా అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులకు గురవుతారు. అయితే అనుకోకుండా ఎక్కువ మొత్తంలో లోన్లు తీసుకున్నవారు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే… ముందుగా తనకు వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలి. అంటే ఉద్యోగులు అయితే అదనపు ఆదాయం కోసం మరో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండాలి. వ్యాపారులు తన వ్యాపారాన్ని వివిధ రకాలుగా విస్తరించు ఆదాయం పెంచుకునే విధంగా చేయాలి. అప్పుడే అదనపు ఆర్థిక భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
ఒక్కోసారి బ్యాంకు రుణం తీసుకొని కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత ఆ వస్తువులతో ఉపయోగం లేక అవి మూలన పడి ఉంటాయి. వీటితో ఎలాంటి ఉపయోగం లేకున్నా వాటి. emi మాత్రం చెల్లిస్తూ ఉంటాం. ఇలాంటి అప్పుడు ఆ వస్తువును కాస్త తక్కువ ధరకైనా విక్రయించడం వారి ద్వారా ఎంతోకొంత డబ్బు వస్తుంది. దీనితో మరికొంత మొత్తాన్ని జమ చేసి చిన్న లోన్లను క్లియర్ చేసుకోవచ్చు.
కొన్ని రుణాలు సెక్యూరిటీగా ఉంటాయి. మరికొన్ని రుణాలు అధిక వడ్డీ రేటుని విధిస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువ రేటు వడ్డీ కలిగిన లోన్లను తక్కువ వడ్డీ అందించే రుణాలు తీసుకొని చెల్లించాలి. ఇలా చేయడం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది. దీంతో ఉన్న ఆదాయంలో కొంతవరకు రుణాన్ని పూర్తి చేసి ఉపశమనం పొందవచ్చు.
మీరు ఇప్పటివరకు తీసుకున్న లోన్లు జన్యు గా ఉంటే మీ పరిస్థితిని దగ్గరి బంధువులకు చెప్పుకోవచ్చు. ఇలా వారి దగ్గర నుంచి వడ్డీ లేని రుణాన్ని తీసుకొని బ్యాంకు లోన్ తీర్చుకోవాలి. ఆ తర్వాత బంధువులకు ఇస్తూ ఉండాలి.ఇలా చేయడం ద్వారా వడ్డీ భారాన్ని నుంచి తప్పించుకోవచ్చు. ఈ విధంగా ప్లాన్ చేయడం ద్వారా ఆర్థిక భారం నుంచి బయటపడవచ్చు.