Car: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం.. ’ అన్న సామెత గురించి అందరికీ తెలిసిందే. అదే మాదిరిగా ఓ కారు చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ దీని మైలేజ్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నేటి కాలంలో కారు కొనుగోలు చేసేవారు ఎక్కువ మంది మైలేజ్ గురించే ఆలోచిస్తున్నారు. అంతేకాకుడా సిటీల్లో ఉండేవారు చిన్న చిన్న అవసరాల కోసం చిన్న కారును తీసుకోవాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు స్కూటీల కంటే చిన్న కారును తీసుకోవడం వల్ల వివిధ అవసరాలు తీర్చుకోవాలని ఆలోచిస్తన్నారు. ఇలాంటి వారి కోసం Bajaj కంపెనీ ఓ ‘క్యూట్’ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
ఆటమోబైల్ రంగంలో Bajaj ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ కంపెనీ నుంచి ఎక్కువగా స్కూటర్, ఆటోలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ కంపెనీ ఆటోకు ఎక్కువ.. సాధారణ కారుకు తక్కవ అన్నట్లుగా ఒకటి ఆకర్షించే కారును తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పేరు Bajaj Qute RE60. తక్కువ బడ్జెట్ తో పాటు చిన్న అవసరాల కోసం ఈ కారు అనుగుణంగా ఉంటుంది. దీనిని 2019లోనే లాంచ్ చేశారు. కానీ ఎక్కువగా ప్రచారం చేయలేదు. కానీ దీని ఫీచర్స్, డిజైన్ చూస్తే తప్పకుండా లైక్ చేస్తారు.
Bajaj Qute RE60 ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో మొత్తం నాలుగు సీట్లు ఉంటాయి. డ్రైవర్ తో సహా 4గురు ప్రయాణం చేయొచ్చు. 20 లీటర్ల బూట్ స్పేస్ తో పాటు ఏసీ, రూఫ్, ఎల్ ఈడీ లైట్లు, 2 డోర్లు ఉన్నాయి. నగరాల్లో ప్రయాణం చేయాలంటే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ కారులో ఈజీగా బయటపడొచ్చు. ఇందులో సేప్టీ కోసం సీట్ బెల్ట్స్ ఉన్నాయి. లగేజీ కోసం కూడా ప్రత్యేకంగా స్పేస్ ఉంది. దీంతో చిన్న వ్యాపారులు సరుకులు తీసుకురావడానికి ఇది అనుగుణంగా ఉంటుంది. ఇక చిన్న ఫ్యామిలీలో ఉండే విద్యార్థులను స్కూల్ కు తీసుకెళ్లడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ కారులో పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజిన్ 13 బీహెచ్ పీ పవర్, 19.6 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4 స్పీడ్ మాన్యువల్ తో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ కారు పెట్రోల్ ఇంజిన్ లో 35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది సీఎన్ జీ వేరియంట్ లో 43 కిలోమీర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కారు మొత్తం మూడు కలర్లలో అందుబాటులో ఉంది. డార్క్ ఎల్లో కలర్ కారు విపరీతంగా ఆకర్షిస్తోంది. Bajaj Qute RE60 ని ప్రస్తుతం రూ. 3.61 లక్షల ప్రారంభధరతో విక్రయిస్తున్నారు. అయితే ఈ కారు కొనుగోలు చేసే సమయంలో ఈఎంఐ ఆప్షన్ కూడా సౌకర్యం ఉంది. రూ.36 వేలు చెల్లించి కారును తీసుకెళ్లొచ్చు.