Bajaj Auto : పాత కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బజాజ్ చేతక్ స్కూటర్, కొత్త అవతారంలో మళ్లీ రోడ్డెక్కి సందడి చేస్తోంది. అయితే, ప్రస్తుతం బజాజ్ ఆటో కంపెనీకి జీఎస్టీ వ్యవహారాల్లో భారీ జరిమానా ఎదురైంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ల వర్గీకరణకు సంబంధించి పూణే-II కమిషనరేట్ పరిధిలోని జాయింట్ కమిషనర్ బజాజ్ ఆటోపై రూ. 10.04 కోట్ల జరిమానా విధించాడు. అయితే, ఈ నిర్ణయాన్ని బజాజ్ ఆటో పూర్తిగా వ్యతిరేకిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది.
జీఎస్టీ విభాగం నిర్ణయం
జూలై 2017 నుండి మార్చి 2022 వరకు, బజాజ్ ఆటో తమ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను HSN కోడ్ 9029 కింద వర్గీకరించగా, జీఎస్టీ అధికారులు 8708/8714 కింద వర్గీకరించాల్సిందని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు జాయింట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయగా, కంపెనీ వాటిని సమర్థంగా ఖండించింది.
మొత్తం జరిమానా ఎంత?
కంపెనీ ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తూ రూ. 10,03,91,402 GST వ్యత్యాసం డిమాండ్‌ను ఆర్డర్లో నిర్ధారించినట్లు తెలిపింది. జాయింట్ కమిషనర్ ఆ డిమాండ్‌ను కంపెనీ జమ చేసిన పన్నుకు ప్రతిగా స్వాధీనం చేసుకున్నారు. బజాజ్ ఆటో రూ.10,03,91,402 వడ్డీ, జరిమానా రూ.25,000 సాధారణ జరిమానా కూడా విధించిందని, మొత్తం జరిమానా మొత్తం రూ.10,04,16,402కి చేరుకుందని తెలిపింది.
రూ.10 కోట్ల జరిమానా వివరాలు
జాయింట్ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం:
* రూ. 10,03,91,402 పన్ను వ్యత్యాసంగా నిర్ణయించబడింది.
* రూ. 25,000 సాధారణ జరిమానా విధించారు.
* మొత్తం జరిమానా: ₹10,04,16,402.
బజాజ్ ఆటో స్పందన
బజాజ్ ఆటో ఈ జరిమానా తమపై పెద్ద ఆర్థిక ప్రభావాన్ని చూపదని స్పష్టం చేసింది. అంతేకాదు, బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌ను విస్మరించేందుకే ఈ ఉత్తర్వులు ఇచ్చారని కంపెనీ ఆరోపించింది. తమ వాదన బలంగా ఉందని, నిర్ణయాన్ని సవాలు చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో బజాజ్ ఆటోకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ప్రస్తుతం కంపెనీ ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొనడానికి సిద్ధమవుతుండగా, జీఎస్టీ అధికారులు తమ విధానంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.