Automobile Industry: ఒకప్పుడు ఇంటికో సైకిల్ ఉంటే వారిని ప్రత్యేకంగా చూసేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో బైక్ లేదా స్కూటర్ కనిపిస్తోంది. మారుతున్న జీవన విధానాలు, అవసరాలను బట్టి ఇంటికొక టూవీలర్ కచ్చితంగా ఉంటుంది. ఈ పరిస్థితి కూడా మొన్నటి వరకు పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రజలు సైతం సొంతంగా వెహికల్ ఉండాలని కోరుకుంటున్నారు. 2026 కొత్త సంవత్సరంలో జనవరి నెలలో అత్యధికంగా వాహనాలు అమ్ముడుపోయినట్లు కొన్ని లెక్కల ద్వారా తెలుస్తుంది. Federation of Automobile Dealers Association (FADA) రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఈ ఒక్క నెలలోనే రికార్డు అమ్మకాల సృష్టించింది.. ఆ వివరాల్లోకి వెళ్తే..
FADA వివరాల ప్రకారం జనవరి ఒక్క నెలలో దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం 21% వృద్ధిని సాధించింది. అంటే ప్రతిరోజు సంఘటన 60 వేల వాహనాల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలతో పోలిస్తే జనవరి నెలలో మరింత ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. జనవరి నెలలో వచ్చిన పండుగల సీజన్ తో పాటు వ్యక్తిగత అవసరాలు పెరగడంతో వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావడంతో పాటు వీటిని తక్కువ ధరకే విక్రయించడం వల్ల చాలామంది ఒకటికి మించి వాహనాలు కొనుగోలు చేశారు.
అయితే ఈ కొనుగోలు శక్తి పట్టణాలు, నగరాల కంటే గ్రామాల్లోని ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రజల్లో ఆదాయం పెరగడంతో పాటు తమ అవసరాలకు అనుగుణంగా సొంతంగా వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పట్టణాల్లోనూ పెద్ద వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఉండడంతో చిన్నచిన్న వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.. అయితే దేశంలోని కొన్ని కంపెనీల వాహనాలపైనే ఎక్కువగా మగ్గు చూపినట్లు తెలుస్తోంది. టూవీలర్ దిగజం అయిన Hero కంపెనీ ఈ యొక్క నెలలోనే 25.56% వాటాను పొందింది. అంటే జనవరి నెలలో ఈ కంపెనీ 4, 96,167 వాహనాలను విక్రయించింది. అలాగే హోండా కంపెనీ రెండో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 4,72,938 వెహికల్స్ విక్రయాలు చేసింది. ఆ తర్వాత టీవీఎస్ 3,64,241 విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది.
ఈ కంపెనీలు తక్కువ ధర కే వాహనాలను అందించి మైలేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో కొనుగోలుదారులకు ఇవి అనుగుణంగా మారాయి. అందుకే ఈ కంపెనీలో టాప్ త్రీ లోకి వచ్చాయి. అయితే వాహనాల కొనుగోలుకు ఒకేసారి పేమెంట్ కాకుండా బ్యాంకు ద్వారా ఈఎంఐ ఆప్షన్ ఉండడంతో పాటు కొన్ని రకాల ఆఫర్లు ఇవ్వడంతో కొంతమంది ప్రత్యేకంగా వెహికల్స్ ను కొంటున్నారు. అంతేకాకుండా బ్యాంకు లోన్ గతంలో కంటే ఇప్పుడు సులభంగా మారడంతో చాలామంది దీని ద్వారా కూడా కొరుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు మరింత సౌకర్యవంతంగా ఉండడంతో వీటి కొనుగోలుపై ఆసక్తి పెరిగింది.