https://oktelugu.com/

Automatic Car Vs Manual Car: ఆటోమేటిక్ కార్లు కంటే మాన్యువల్ కార్లను ఎందుకు ఎక్కువగా కొంటున్నారు?

ఆటోమేటిక్ కార్లలో ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు ట్రాన్స్ మిషన్ వేడెక్కుతుంది. దీంతో డ్రైవ్ మోడ్ లో ఉన్నప్పుడు బ్రేక్ పై తప్పనిసరిగా పాదాలను ఉంచాలి. కానీ మాన్యువల్ గేర్ బాక్స్ విషయంలో ఇంత అవసరం లేదు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 14, 2024 12:40 pm
    Automatic Car Vs Manual Car

    Automatic Car Vs Manual Car

    Follow us on

    Automatic Car Vs Manual Car: భారత్ లో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా తరువాత ప్రతి ఒక్కరూ సొంత వెహికల్ ఉండాలనుకుంటున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కారు కొనడానికి ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు. అయితే తమకున్న బడ్జెట్ తో పాటు ఇక్కడి రోడ్లపై సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా ఉండే వాటిపై ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ ఎక్కువ మంది మాన్యువల్ గేర్ బాక్స్ కార్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ కు గల తేడాలేంటి? ఎందుకు ఎక్కువగా మాన్యువల్ కార్లను కొనుగోలు చేస్తున్నారు?

    ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్ల కంటే మాన్యువల్ కార్లు ఎక్కువగా కొనడానికి ధర కూడా ప్రధానం అని చెప్పవచ్చు. మాన్యువల్ గేర్ బాక్స్ కారు కంటే ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కారు రూ.80 వేల వరకు ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ భారాన్ని తప్పించుకునేందుకు మాన్యువల్ కార్లను కొంటున్నారు. అంతేకాకుండా మరికొన్ని కారణాల వల్ల ఏఎంటీ కార్లకు ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఏఎంటీ కార్ల మెయింటనెన్స్ ఛార్జీలు ఎక్కువగా అవసరం ఏర్పడుతాయి. ఇందులో ఏ చిన్న పార్టు కదిలించినా వేలల్లో ఖర్చవుతుంది. అదే మాన్యువల్ కార్లలో మాత్రం చిన్న మొత్తంతో రిపేర్ చేయించుకోవచ్చు.

    కారు ఉన్న వారు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్ల కు ఎక్కవగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటికి అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉండడంతో ఎందుకీ భారం అనుకొని కూడా ఆటోమేటిక్ కార్లకు దూరమవుతున్నారు. మాన్యువల్ గేర్ బాక్స్ లో ఎక్కువగా సాంకేతిక లోపాలు ఉండవు. ఏ చిన్న సమస్య వచ్చినా ఈజీగా పరిష్కారం అవుతుంది. కానీ ఆటోమేటిక్ లో క్లిష్టమైన నిర్మాణం ఉంటుంది. దీంతో వీటి సమస్య పరిష్కారానికి ఖర్చుతో పాటు సమయమూ తీసుకుంటుంది.

    ఇండియన్ పీపుల్స్ కారు కొనాలని భావించినప్పుడు ఇక్కడి రోడ్లపై డ్రైవింగ్ కు అనుగుణంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ కార్లు పెద్ద రోడ్లపై రయ్యని దూసుకెళ్తాయి. కానీ ఇక్కడ చాలా సార్లు వివిధ పనుల నిమిత్తం ట్రాఫిక్ లో ప్రయాణించాల్సి వస్తుంది. ఈ తరుణంలో ట్రాఫిక్ లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ కంటే మాన్యువల్ గా ఉండే వాటితో అనుకూలంగా ప్రయాణించవచ్చు. ఈ కారణంగా మాన్యువల్ గేర్ బాక్స్ కార్లపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. .

    ఆటోమేటిక్ కార్లలో ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు ట్రాన్స్ మిషన్ వేడెక్కుతుంది. దీంతో డ్రైవ్ మోడ్ లో ఉన్నప్పుడు బ్రేక్ పై తప్పనిసరిగా పాదాలను ఉంచాలి. కానీ మాన్యువల్ గేర్ బాక్స్ విషయంలో ఇంత అవసరం లేదు. అంతేకాకుండా వేగాన్ని కంట్రోల్ చేసే శక్తి డ్రైవర్ కు ఉంటుంది. కొంతమంది సాంప్రదాయాలు కారు ఉండాలని కోరుకున్నా స్మూత్ డ్రైవ్ ఉండే విధంగా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో మాన్యువల్ కార్లు సింపుల్ గా పెద్ద వారికి సైతం సౌకర్యంగా ఉంటాయి. అందువల్ల మాన్యువల్ కార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.