Ather Rizta: అప్పట్లో పెట్రోల్ ధరలు మండిపోయాయి. గత కొంతకాలంగా వాటి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. ఎప్పుడు పెరుగుతాయో ఎవరికీ తెలియదు. పైగా మారుతున్న కాలంలో ద్విచక్ర వాహనం లేకుండా అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరను భరించలేని వారికి ఆశా దీపం లాగా మారిపోయాయి ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఒకప్పుడు ఇవి పాశ్చాత్య దేశాలలో మాత్రమే కనిపించేవి. మన దేశం కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థల ప్లాంట్ల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపడంతో.. మనదేశంలో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారవుతున్నాయి.. అయితే ఇవి కొంత దూరం వరకే ప్రయాణించగలుగుతాయి. వీటి మీద ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది. వీటి సామర్థ్యం కూడా తక్కువ. మారుతున్న వినియోగదారుల అవసరాల ఆధారంగా అథర్ రిజ్టా అనే సంస్థ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను శనివారం న్యూఢిల్లీలో ఆవిష్కరించింది. ఇంతకీ దీని విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.
దీని ప్రత్యేకతలు ఏంటంటే..
అథర్ రిజ్టా.. ఇది పూర్తి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒకసారి చార్జింగ్ పెడితే 165 కిలోమీటర్ల వరకు నిరాటంకంగా ప్రయాణించవచ్చు. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో అథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ అతిపెద్దది. ఫ్రంట్, బ్యాక్ విశాలవంతమైన సీటింగ్ కెపాసిటీ, 56 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఈ స్కూటర్ సొంతం. ఇందులో అన్ని రకాల వస్తువులను భద్రపరచుకోవచ్చు. భారతీయ కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థ ఈ స్కూటర్ ను రూపొందించింది. ఈ స్కూటర్ ను 1,09,999(ఢిల్లీ ఎక్స్ షోరూం) విక్రయించనుంది.. ఈ స్కూటర్లలో రిజ్టా ఎస్, రిజ్టా జడ్ అనే రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. రిజ్టా ఎస్ అనేది చిన్న బ్యాటరీ ప్యాక్ (2.9 kWh) కలిగి ఉంటుంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 121 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది..రిజ్టా జడ్ అనేది పెద్ద బ్యాటరీ ప్యాక్ (3.7 k Wh) కలిగి ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. IP67 రేటింగ్ తో ఈ రెండు వేరియంట్ల స్కూటర్ల బ్యాటరీలను ప్యాక్ చేసినట్టు తయారీ సంస్థ చెబుతోంది. దీని ప్రకారం వాటర్ వేడింగ్ కెపాసిటీ 400 మిల్లీ లీటర్ల వరకు ఉంటుంది. అంటే దాదాపు అన్ని రకాల రోడ్లమీద ఈ స్కూటర్లను డ్రైవ్ చేయవచ్చు.
ముందు చూపుతో వ్యవహరించింది
స్కూటర్ల తయారీలో ఈ సంస్థ చాలా ముందుచూపుతో వ్యవహరించింది. స్టోరేజ్, స్పేస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ స్కూటర్ పై ఇద్దరూ పెద్దలు కలిసి కూర్చున్న తర్వాత కూడా.. ఇంకా కాస్త స్థలం మిగిలే ఉంటుంది. పొడవైన వ్యక్తులకు కూడా మెరుగైన, ప్లాట్ బోర్డు ఈ స్కూటర్లపై ఉంది. పిలియన్ రైడర్లకు.. బ్యాక్ రెస్ట్ సపోర్ట్ కూడా ఈ స్కూటర్లపై లభిస్తుంది. ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ 22 లీటర్ల వరకు ఉంటుంది. బూట్ స్పేస్ 34 లీటర్ల వరకు ఉంటుంది. మొత్తం ఈ స్కూటర్ బూట్ స్పేస్ 56 లీటర్లు. అంతేకాదు అండర్ ఫీడ్ స్టోరేజ్ లో ఒక చిన్న ప్యాకెట్ కూడా ఉంటుంది. రిజ్టా ఎస్ రకంలో 7.0 అంగుళాల నాన్ టచ్ డీప్ వ్యూ డిజిటల్ డిస్ ప్లే ఉంది. ఇది 450 S లో కనిపిస్తోంది. జడ్ వేరియంట్ లో 450X రేంజ్ లో 7.0 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ ప్లే అందుబాటులో ఉంది. టెలిస్కోపిక్ ఫోర్క్, 12 అంగుళాల అల్లాయ్ ఫ్రంట్ వీల్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో కూడిన సెక్యూరిటీ కవర్ ఈ స్కూటర్ సొంతం. అంతేకాదు ర్యాంప్ రౌండ్ LED టెయిల్ లైట్ ఈ స్కూటర్ కు ఉన్న ఆకర్షణల్లో ప్రధానమైనది.
సమర్థవంతమైన బ్యాటరీ
ఇక ఇటీవల ఈ కంపెనీ ఈ స్కూటర్ బ్యాటరీ డ్రాప్ టెస్ట్ వీడియోను ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేసింది. అందులో స్కూటర్ కు ఉపయోగించిన బ్యాటరీని ఓ వ్యక్తి మోసుకుంటూ క్రేన్ ఎక్కినట్టు ఆ వీడియోలో చూపించారు. క్రేన్ స్లైడర్ 40 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత.. ఆ బ్యాటరీ పైనుంచి కింద పడేస్తారు. అంత ఎత్తు నుంచి పడిపోయినప్పటికీ బ్యాటరీ సురక్షితంగా ఉంటుంది.. ఈ స్కూటర్ కోసం వాడిన బ్యాటరీ అత్యంత సురక్షితమైనదని సంస్థ ఆ వీడియోలో చెప్పే ప్రయత్నం చేసింది. బ్యాటరీ మాత్రమే కాకుండా.. స్కూటర్ సీట్ కింద ఎక్కువ స్పేస్ ఉంది. ఇందులో ABS లేదాCBS, Google maps, Bluetooth, OTA అప్డేట్స్ లతో వచ్చే Ather Stack ను కూడా స్వీకరించే సౌలభ్యం ఈ స్కూటర్ లలో తయారీ సంస్థ పొందుపరిచింది.
Metal where it matters!
In your Ather450.PS: Stunts performed by professional batteries. Don’t try these at home with random ones. https://t.co/0jACxzOYOu
— Tarun Mehta (@tarunsmehta) March 12, 2024