
మనలో కొంతమంది ఉద్యోగం చేయడాన్ని అస్సలు ఇష్టపడరు. సొంతంగా ఏదో పని చేయడం లేదా వ్యాపారం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. వ్యాపారం చేయాలంటే ప్రస్తుత కాలంలో లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. అలా కాకుండా తక్కువ పెట్టుబడితో సొంతూరిలో వ్యాపారం చేయడం ద్వారా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది.
ప్రస్తుతం దేశంలో ఏకంగా 1,55,000 పోస్టాఫీస్ లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూడా పోస్టల్ వ్యవస్థను విస్తరించాలని అనుకుంటోంది. ప్రాంఛైజ్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మనీ ఆర్డర్లు, స్టాంపులు, స్టేషనరీ, లెటర్స్ పంపిణీ, బ్యాంకుల ఖాతాలు, చిన్న పొదుపు ఖాతాలను సులువుగా తెరవడం సాధ్యమవుతుంది. 18 ఏళ్లు నిండి ఎనిమిదో తరగతి పాసైన వాళ్లు ఈ ఫ్రాంఛైజీ కోసం రిజిష్టర్ చేసుకోవచ్చు.
ఇండియన్ పోస్టల్ అవుట్లెట్, పోస్టల్ ఏజెంట్ ఫ్రాంఛైజీలను అందిస్తుండగా ఇప్పటివరకు ఈ సేవలు అందుబాటులో లేని ప్రాంతంలో మాత్రమే ఫ్రాంఛైజీని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. 5,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి పోస్టల్ ఫ్రాంఛైజీని తీసుకోవచ్చు. పోస్టల్ ఏజెంట్ కోసం మాత్రం స్టేషనరీ సామన్లను కొనుగోలు చేయడానికి అదనపు పెట్టుబడి పెట్టాలి.
200 చదరపు అడుగుల కార్యాలయం ఉంటే మాత్రమే ఫ్రాంఛైజీని ఓపెన్ చేయడం సాధ్యమవుతుంది. https://www.indiapost.gov.in/vas/dop_pdffiles/franchise.pdf ఫామ్ ను నింపి స్థానిక పోస్టాఫీస్ లో సమర్పించాలి. ఈ ఫ్రాంఛైజ్ ద్వారా స్పీడ్ పోస్ట్‌కు రూ. 5, మనీ ఆర్డర్‌కు రూ. 3 నుంచి రూ. 5, పోస్టల్ స్టాంపులు, స్టేషనరీల అమ్మకాలపై 5 శాతం కమిషన్ పొందే అవకాశం ఉంటుంది.