https://oktelugu.com/

Credit Card : క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి

క్రెడిట్ కార్డ్ రద్దు చేయకుండా నిర్లక్ష్యం వహించిన బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకున్నారు. చాలామందికి ఈ విషయం తెలియక.. బ్యాంకు విధించే పెనాల్టీ కడుతుంటారు. అందువల్ల క్రెడిట్ కార్డు వాడేవారు అంబుడ్స్ మన్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

Written By:
  • NARESH
  • , Updated On : March 3, 2024 8:55 pm
    Follow us on

    credit card : బ్యాంకింగ్ వ్యవస్థలో నిబంధనల వల్ల ఒకప్పుడు కొంతమందికి మాత్రమే క్రెడిట్ కార్డులు పరిమితమయ్యేవి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు మార్చడం, ఆర్థిక స్థిరత్వం పెరగడంతో ఇప్పుడు చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. వ్యాపార సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటించడంతో చాలామంది క్రెడిట్ కార్డ్ ల ద్వారానే కొనుగోళ్ళు జరుపుతున్నారు.. ఇలా కొనుగోలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి.. ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మోసపూరితమైన ఈ మెయిల్స్ కు రెస్పాండ్ కావొద్దు. అన్నింటికీ మించి క్రెడిట్ కార్డ్ వ్యవహారాలు ఆన్ లైన్ లో ఎంటర్ చేయకూడదు. మరీ ముఖ్యంగా బ్యాంకుకు బకాయిలను ప్రతినెల ఐదవ తేదీ లోపలే చెల్లించాలి. లేకుంటే అదనపు వడ్డీ భారం పడుతుంది.

    చాలామంది క్రెడిట్ కార్డులను వాడిన తర్వాత.. అప్పులు పెరిగిపోతే ఒక్కసారిగా వాటి వాడకాన్ని తగ్గిస్తారు. కొందరైతే పూర్తిగా ఆ క్రెడిట్ కార్డులను బ్యాంకులకు అప్పగిస్తారు. అలాంటప్పుడు కచ్చితంగా క్రెడిట్ కార్డు రిటర్న్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి. వారం రోజుల్లో సదరు బ్యాంకు ఆ కార్డును రద్దు చేస్తుంది. వారం రోజుల్లో బ్యాంకు ఆ కార్డును రద్దు చేయకుంటే ప్రతిరోజు మన ఖాతా నుంచి రూపాయి డిడక్ట్ అవుతుంది. అయితే చాలా వరకు బ్యాంకులు క్రెడిట్ కార్డు రిటర్న్ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత కూడా దానిని రద్దు చేయవు. అలాంటప్పుడు ఖాతాదారులు నష్టపోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు బ్యాంకు నుంచి మనం పరిహారం కోరొచ్చు. అవసరమైతే అంబుడ్స్ మన్ లో ఫిర్యాదు కూడా చేయవచ్చు.

    కొద్దిరోజుల క్రితం ఓ ఉద్యోగి తనకు క్రెడిట్ కార్డు వద్దని దానిని జారీ చేసిన బ్యాంకు అధికారిని సంప్రదించాడు. రిటర్న్ ఫార్మ్ ఫిల్ అప్ చేసి ఇచ్చాడు. మూడు నెలలైనా కూడా అతని కార్డు రద్దు కాలేదు. పైగా అతని ఖాతాలో రోజుకు రూపాయి చొప్పున డిడక్ట్ అయింది. దీంతో అతడు బ్యాంకు అంబుడ్స్ మనకి ఫోన్ దీంతో అతడు బ్యాంకు అంబుడ్స్ మన్ లో ఫిర్యాదు చేశాడు. వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం మూడు నెలలు అంటే 90 రోజులకు రోజుకి 500 రూపాయల చొప్పున 45000 ఆ ఖాతాదారుడి ఎకౌంట్లో జమ చేశారు. క్రెడిట్ కార్డ్ రద్దు చేయకుండా నిర్లక్ష్యం వహించిన బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకున్నారు. చాలామందికి ఈ విషయం తెలియక.. బ్యాంకు విధించే పెనాల్టీ కడుతుంటారు. అందువల్ల క్రెడిట్ కార్డు వాడేవారు అంబుడ్స్ మన్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.