Toyota buyers alert: ప్రముఖ మోటార్ సంస్థ టయోటా సంస్థకు చెందిన పలు వాహనాల ధరలను పెంచింది. డీజిల్ ఇన్నోవా క్రిస్టా మోడల్ ధరలు గరిష్ఠంగా రూ.33,000 పెరిగాయి. ఎంట్రీ–లెవల్ జీఎక్స్ వేరియంట్లు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. జీఎక్స్ + మోడల్స్ రూ.21 వేలు, బీఎక్స్, జెడ్‌ఎక్స్ వేరియంట్లు రూ.25 వేల నుంచి రూ.26 వేలు పెరిగాయి. ఇప్పుడు క్రిస్టా ధరలు రూ.18.99 లక్షల నుంచి రూ.25.53 లక్షల వరకు (ఎక్స్–షోరూమ్) ఉన్నాయి.
హైక్రాస్ మార్పులు…
పెట్రోల్–హైబ్రిడ్ ఇన్నోవా హైక్రాస్ ధరలు గరిష్ఠంగా రూ.48 వేలు పెరిగాయి. బేస్ ఎ వేరియంట్ ఆపేశారు. జీక్స్(ఓ) మోడల్స్ రూ.31 వేలు, వీఎక్స్‌పైన హైబ్రిడ్ వేరియంట్లు రూ.40 వేల నుంచి 48 వేలు పెరిగాయి. ధర పరిధి రూ.19.15 లక్షల నుంచి రూ.32.38 లక్షల వరకు (ఎక్స్–షోరూమ్).
ఫోర్చూనర్, లెజెండర్‌పై గరిష్ట పెంపు..
ఫోర్చూనర్ మోడల్స్ ధరలు గరిష్ఠంగా రూ.74 వేల పెరిగాయి. లెజెండర్ వేరియంట్లు రూ.71 వేల వరకు హైక్. ఎంట్రీ పెట్రోల్–మాన్యువల్ వేరియంట్ రూ.51 వేలు పెరిగింది. 4×4 మోడల్స్ రూ.50 వేలకన్నా ఎక్కువ పెరిగాయి. ధరలు రూ.34.16 లక్షల నుంచి రూ.49.59 లక్షల వరకు. డీలర్–లెవల్ ’లీడర్’ వేరియంట్లు ఆపేశారు.
రూమియాన్ బేస్ వేరియంట్ నిలిపవేత..
రూమియాన్ ఈఎంటీ బేస్ మోడల్ (మునుపు రూ.9.51 లక్షలు) ఆపేశారు. ఇప్పుడు ధరలు రూ.10.44 లక్షల నుంచి రూ.13.62 లక్షల వరకు.
ధరలు మారని మోడల్స్..
తైసార్, హైరైడర్, రూమియాన్ (ఇతర వేరియంట్లు), హైలక్స్, కామ్రీ, వెల్‌ఫైర్, ల్యాండ్ క్రూజర్ 300 మోడల్స్ ధరలు మారలేదు.