Smart Phones:  కొత్త ఫోన్ ను కొనుగోలు చేస్తున్నారా.. గుర్తుంచుకోవాల్సిన విషయాలివే?

Smart Phones:  మన దేశంలో ప్రస్తుతం ఎన్నో ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లు ప్రజలకు అందుబాటులోకి ఉన్నాయి. 3000 రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు వేర్వేరు ధరలలో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటం గమనార్హం. సంవత్సరం సంవత్సరానికి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్నవాళ్లు సైతం కొత్త స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేవాళ్లు కొన్ని […]

Written By: Kusuma Aggunna, Updated On : January 12, 2022 7:18 pm
Follow us on

Smart Phones:  మన దేశంలో ప్రస్తుతం ఎన్నో ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లు ప్రజలకు అందుబాటులోకి ఉన్నాయి. 3000 రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు వేర్వేరు ధరలలో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటం గమనార్హం. సంవత్సరం సంవత్సరానికి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్నవాళ్లు సైతం కొత్త స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే ముందు ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో ధరలను పోల్చి చూడాలి. ఎక్కడ తక్కువగా ధర ఉంటే అక్కడే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తే మంచిది. స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే సమయంలో ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్‌ ల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండేది. అవసరమైన ఫీచర్లు ఉన్న ఫోన్లను మాత్రమే కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.

ఫోన్ ను కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయనే విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. ఫేస్ లాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు ఐరిష్ స్కానర్, ఇతర సెక్యూరిటీ ఫీచర్లు ఉంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే మంచిది. సెక్యూరిటీ ఫీచర్లు లేని స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. గేమింగ్ ఫోన్లను కొనుగోలు చేయడం వల్ల సమయం వృథా అయ్యే ఛాన్స్ ఉంది.

స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ కు బానిసలు అయితే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందువల్ల గేమింగ్ ఫోన్స్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ఖరీదైన ఫోన్ కంటే అవసరమైన ఫీచర్లు ఉన్న ఫోన్ కు ప్రాధాన్యత ఇస్తే డబ్బు ఆదా అవుతుంది. మొదట బడ్జెట్ ను ఫిక్స్ చేసుకొని స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉండదు.