https://oktelugu.com/

Naga Chaitanya: ‘సమంత’తో విడిపోవడం చైతుకి హ్యాపీ అట.. మరి సమంతకి ?

Naga Chaitanya: చైతు – సమంత విడాకుల పై అందరూ స్పందించారు. కానీ, ఇప్పటి వరకు ఇటు చై, అటు సామ్ ఈ అంశం పై ఏమి మాట్లాడలేదు. అయితే, మొదటిసారి సమంతతో తన విడాకులపై నాగచైతన్య స్పందించాడు. ‘మేము విడాకులు తీసుకున్నాక సంతోషంగా ఉన్నాం అని, నేను హ్యాపీగా ఉన్నాను, సమంత కూడా చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ చైతు చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా మేము […]

Written By:
  • Shiva
  • , Updated On : January 12, 2022 / 06:23 PM IST

    Naga Chaitanya

    Follow us on

    Naga Chaitanya: చైతు – సమంత విడాకుల పై అందరూ స్పందించారు. కానీ, ఇప్పటి వరకు ఇటు చై, అటు సామ్ ఈ అంశం పై ఏమి మాట్లాడలేదు. అయితే, మొదటిసారి సమంతతో తన విడాకులపై నాగచైతన్య స్పందించాడు. ‘మేము విడాకులు తీసుకున్నాక సంతోషంగా ఉన్నాం అని, నేను హ్యాపీగా ఉన్నాను, సమంత కూడా చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ చైతు చెప్పుకొచ్చాడు.

    Naga Chaitanya

    పనిలో పనిగా మేము ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉన్నాం’ అని కూడా చైతు తెలిపాడు. మరి విడాకులపై నాగచైతన్య స్పందించినట్లు సమంత కూడా త్వరలోనే స్పందిస్తుందేమో చూడాలి. గతంలో కూడా చైతు ట్వీట్ లో ఇలాంటి మెసేజే పోస్ట్ చేశాడు. ‘మేం భార్యాభర్తలుగా విడిపోయినా.. ఎప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటామని చెప్పుకొచ్చాడు. అలాగే అటు సమంత కూడా ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా మార్చి పోస్ట్ చేసింది.

    Also Read: అప్పటి ముచ్చట్లు : ఎన్టీఆర్ కి చుట్ట తాగడం నేర్పింది ఆ విలనే !

    అంతే, మళ్ళీ చైతు – సామ్ ఎక్కడా కలిసి కనబడలేదు. పైగా ఒకరి గురించి మరొకరు మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. మొత్తమ్మీద భార్యాభర్తలుగా విడిపోయినా.. ఎప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటాం అని చెప్పిన మాటలు.. ఒట్టి మాటలు అని తేలిపోయింది. ఇక చై – సామ్ విడాకుల పై అక్కినేని నాగార్జున కూడా అప్పుడు ‘ఎంతో బాధపడుతూ ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది’ అంటూ సమంత, చైతు విడిపోవటం నిజంగా ఎంతో దురదృష్టకరం’ అని పోస్ట్ చేశాడు.

    అయితే, సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో మా ఫ్యామిలీ గడిపిన ప్రతిక్షణం మాకు ఎంతో మధురమైనది. సమంత మా ఫ్యామిలీకి చాలా దగ్గరైంది. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అంటూ నాగార్జున జస్ట్ క్యాజువల్ గా ఒక మెసేజ్ పెట్టాడు. కానీ ఆ తర్వాత సామ్ పై అనేక ఆరోపణలు వచ్చిన సమయంలో గానీ, ఆమెకు ఈ మధ్య ఓ చిన్న సమస్య వచ్చిన సందర్భంలో గానీ నాగ్ మళ్ళీ స్పందించలేదు.

    Also Read: కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం.. జగన్ కి అర్ధమవుతుందా ?

    Tags