Apple: టెక్ దిగ్గజం ఆపిల్ చాలా కాలంగా సీక్రెట్ గా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. అదే స్మార్ట్ గ్లాసెస్. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఆపిల్ తన స్మార్ట్ గ్లాసెస్‌లో కెమెరా, మైక్రోఫోన్‌ను జోడించేందుకు ప్రయత్నిస్తుంది. అంతేకాదు, కెమెరాతో కూడిన అడ్వాన్స్‌డ్ ఎయిర్‌పాడ్స్‌పై కూడా కంపెనీ దృష్టి సారించింది. రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీ మన అనుభవాలను పూర్తిగా మార్చేయనుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: ఒకప్పటి అక్కినేని నాగ్ తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఏమంటుంది అంటే?
బ్లూమ్‌బెర్గ్ నివేదికలో ఆపిల్ ఈ స్మార్ట్ గ్లాస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘N50’ అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. ఈ స్మార్ట్ గ్లాస్ “ఆపిల్ ఇంటెలిజెన్స్”కు నిజమైన ఉదాహరణగా ఉండాలని ఆపిల్ టార్గెట్ గా పెట్టుకుంది. ఇవి సాంప్రదాయ ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) హెడ్‌సెట్‌ల వలె కాకుండా.. వీటిలో అమర్చిన కెమెరా, సెన్సార్‌లు వినియోగదారుల చుట్టూ ఉన్న పరిసరాలను స్కాన్ చేసి, రియల్ టైంలో AIకి డేటాను అందిస్తాయి.
ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం లేదు. తేలికపాటి బరువు, పవర్ ఫుల్ ఫీచర్లు, మెరుగైన బ్యాటరీ లైఫ్, స్టైలిష్ డిజైన్ మధ్య సరైన సమతుల్యతను సాధించడంలో ఆపిల్ అనేక టెక్నికల్ సవాళ్లను ఎదుర్కొంటోంది. పూర్తిగా పనిచేసే ఏఆర్ గ్లాసెస్‌ను విడుదల చేయడానికి ఆపిల్‌కు కనీసం 3 నుండి 5 సంవత్సరాలు పట్టవచ్చని గతంలో కూడా నివేదికలు వచ్చాయి.
స్మార్ట్ గ్లాసెస్‌తో పాటు ఆపిల్ తన ఎయిర్‌పాడ్స్‌ను మరింత స్మార్ట్‌గా మార్చే దిశగా కూడా పనిచేస్తోంది. కొత్త ఎయిర్‌పాడ్స్‌లో బయటి వైపు చూసే ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ఉంటాయని సమాచారం. ఈ కెమెరాలు సాంప్రదాయ కెమెరాలు కావు, iPhone ఫేస్ ID సెన్సార్ వంటి ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి.కెమెరా అమర్చిన ఎయిర్‌పాడ్స్ 2026 లేదా 2027 నాటికి ప్రారంభం కావచ్చు. అంటే, ఈ అద్భుతమైన గాడ్జెట్‌ల కోసం మనం మరికొన్ని సంవత్సరాలు వేచి ఉండాలి. ఆపిల్ నెమ్మదిగా తన ఈ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, మెటా ఇప్పటికే మార్కెట్‌లోకి ప్రవేశించింది. మెటా 2023లో రే-బాన్‌తో కలిసి తన స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ భారతదేశంలో కూడా తన రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతుంది.