Heera Rajagopal: ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చినవారు వరుసగా సినిమాలు చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో వారు కొన్ని సినిమాల్లోనే నటించి ఫేమస్ అయ్యేవారు. అయితే పలు కారణాలవల్ల అలాంటి హీరోయిన్లు కనుమరుగైపోయారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి హీరోయిన్లు తమ ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారు? చెబుతూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి ఓ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ పొజిషన్ తెలిపి షాక్ ఇచ్చింది. ఒకప్పుడు అక్కినేని నాగార్జున తో పాటు పలువురు తెలుగు హీరోయిన్లతో నటించిన ఓ హీరోయిన్ ప్రస్తుతం ఆమెను చూసి షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
Also Read: మా నాన్నతో కలిసి మందుకొట్టేదానిని అంటూ రీతూ చౌదరి సెన్సేషనల్ కామెంట్స్!
అక్కినేని నాగార్జున ఫ్యామిలీ సినిమాలు ఒకప్పుడు బాగా ఆకట్టుకున్నాయి. ఇలాంటి మూవీలో ఆవిడ.. మా ఆవిడే అనే మూవీ బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో చేసిన సందడి ఆకట్టుకుంటుంది. వీరిలో ఒకరు టబ కాగా.. మరొకరు హీరా రాజగోపాల్.
చెన్నైకి చెందిన హీరా తెలుగులో పబ్లిక్ రౌడీ అనే సినిమాతో ఇంటర్ ఇచ్చింది. ఆ తర్వాత లిటిల్ సోల్జర్స్, దొంగల రాజ్యం, ఆహ్వానం, శ్రీకారం, అంతపురం వంటి సినిమాలు నటించింది. అయితే వీటన్నిటిలో అక్కినేని నాగార్జున నటించిన ఆవిడ మా ఆవిడే అనే సినిమాతో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత చివరిగా వేణు తొట్టెంపూడి హీరోగా వచ్చిన స్వయంవరం చిత్రంలో నటించింది. ఇక తర్వాత తెలుగులో ఏ సినిమాలో కనిపించలేదు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలన్నిటిలో కలిపి 50 కి పైగా సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా మారింది. అయితే సినిమాలో మానేసిన తర్వాత 2022లో పుష్కర్ మాధవ్ ను పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ 2006లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం హీరా ఒంటరిగానే జీవిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ హీరోయిన్ లేటెస్ట్ గా తన సోషల్ మీడియా ఖాతాలో సినీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్ చేసింది. తనకు ఒక నటుడు ద్రోహం చేశాడని.. అభిమానంతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాడని.. అతని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొంది. కొన్ని కారణాలవల్ల వెన్నెముకకు గాయమై ఆపరేషన్ చేయించుకున్నాను అని తన గురించి చెబుతూ వచ్చింది. అయితే ఈ విషయంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.
ఇదిలా ఉండగా అప్పటికి ఇప్పటికీ ఈ హీరోయిన్ పూర్తిగా మారిపోయింది. గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఏమని చూసి అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో ఉన్న సమయంలో యూత్ ను బాగా ఆకర్షించిన ఈమె ప్రస్తుతం కొత్తగా కనిపిస్తున్నారని అంటున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈమె సోషల్ మీడియా లోకి రావడం పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈమె సొంతంగా సోషల్ మీడియాలో రాసుకోవచ్చారా? లేక ఎవరైనా ఆమె పేరు మీద ఇలా చేశారా? అని అనుకుంటున్నారు.