ఈ నెల 24వ తేదీ నుంచి మార్కెట్ లోకి ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లో అడ్వాన్స్‌డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంటుందని తెలుస్తోంది. యాపిల్ గతంలో రిలీజ్ చేసిన మోడల్ ఫోన్స్ తో పోలిస్తే ఈ ఫోన్ లో బ్యాటరీ పెద్దదిగా ఉంది. ఐఫోన్ 13 మోడల్స్ బరువు కూడా ఎక్కువే కావడం గమనార్హం. ఐ ఫోన్ 12తో పోల్చి చూస్తే ఐ ఫోన్ 13 బ్యాటరీ లైఫ్ 12.5 గంటలు ఎక్కువని సమాచారం.
ఈ ఫోన్ 5జీ సర్వీసులను సపోర్ట్ చేయడంతో పాటు వేగవంతమైన 6ఈ స్టాండర్డ్ వైఫైని సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఐఫోన్ 13 సిరీస్ లో త్త ఫేస్ అన్‌లాక్ టెక్ ఉండటం వల్ల మాస్క్ ధరించినా లేదా గ్లాసెస్ ధరించినా ఫోన్ ను అన్ లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండు మోడల్స్ లో 12 మెగాపిక్సెల్స్ డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుందని సమాచారం. సెల్ఫీ కోసం ఇందులో మెగాపిక్సెల్ లెన్స్ ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ లో వీడియోగ్రఫీ సినిమాటిక్ మోడ్ లో ఉంటుంది. యూజర్ పూర్తి హెచ్డీ రిజల్యూషన్ తో కూడా వీడియోలు చేయడం సాధ్యమవుతుంది. ఐ ఫోన్ 13 మినీ ధర 69,900 రూపాయలు కాగా ఐఫోన్ 13 ధర 79,900 రూపాయలుగా ఉంది. ఐఫోన్13 ప్రో ధర 1,19,900 రూపాయలు కాగా ఐ ఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర 1,29,000 రూపాయలుగా ఉంది.