Homeబిజినెస్iPhone discount 8000: యాపిల్ ఈ సిరీస్ పై రూ.8000 తగ్గింపు.. ప్రీమియం ఫీచర్ల ఫోన్...

iPhone discount 8000: యాపిల్ ఈ సిరీస్ పై రూ.8000 తగ్గింపు.. ప్రీమియం ఫీచర్ల ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్..

iPhone discount 8000: యాపిల్ ఫోన్లకు భారతదేశంలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే iphone సిరీస్ కోసం ఎప్పటికీ ఎదురుచూస్తూ ఉంటారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఇప్పటికే 15, 16, 17 సిరీస్ లను రిలీజ్ చేసి ఆకట్టుకుంది. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉన్నా కూడా క్యూ కట్టి మరీ కొనుగోలు చేస్తారు. అయితే అప్పుడప్పుడు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఈ ఫోన్లపై ధరలు తగ్గిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా […]

iPhone discount 8000: యాపిల్ ఫోన్లకు భారతదేశంలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే iphone సిరీస్ కోసం ఎప్పటికీ ఎదురుచూస్తూ ఉంటారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఇప్పటికే 15, 16, 17 సిరీస్ లను రిలీజ్ చేసి ఆకట్టుకుంది. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉన్నా కూడా క్యూ కట్టి మరీ కొనుగోలు చేస్తారు. అయితే అప్పుడప్పుడు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఈ ఫోన్లపై ధరలు తగ్గిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా iphone 16 మొబైల్ పై తగ్గింపు ధరను ప్రకటించింది. దీంతో ఇది మార్కెట్లోకి వచ్చిన కొత్తలో కొనలేని వారు ఇప్పుడు తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎలా ఉంది? దీనిపై ఎంత తగ్గింపు అందించారు?

నేటితరం AI వినియోగదారులను అలరించేలా లేటెస్ట్ టెక్నాలజీ తో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 16 మొబైల్ లో ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో A18 చిప్ సెట్ ఉండడంతో ఇందులో ఏఐ ఫీచర్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మొబైల్ 6.1 అంగుళాల, 6.7 అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2000 nits బ్రైట్నెస్ తో ఉండడంతో ప్రకాశవంతమైన వెలుగును అందిస్తుంది. ఈ మొబైల్ లో కెమెరా పనితీరు కూడా మెరుగ్గానే ఉంటుంది. ఇందులో 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉండగా.. 12 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. ఈ కెమెరా 2 x జూమ్ చేసినా కూడా ఎలాంటి నాణ్యత తగ్గకుండా ఉంటుంది.

వైఫై సెవెన్, బ్లూటూత్ 5.3, యుఎస్బి పోర్టు వంటి ఫీచర్లను కలిగి ఉన్న మొబైల్ లో బ్యాటరీ పనితీరు కూడా బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉన్న బ్యాటరీ ఎలాంటి వేడి కాకుండా వినియోగదారులకు ఫుల్ సపోర్ట్ గా ఉండనుంది. ఈ బ్యాటరీ 25 W ఫాస్ట్ ఛార్జింగ్తో చార్జింగ్కు సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 16 మార్కెట్ లోకి వచ్చినప్పుడు రూ.77,900 గా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ రూ.69,900 తో సేల్స్ చేస్తున్నారు. ఈ ధరపై ప్రస్తుతం రూ.8000 తగ్గిపోదాలను ప్రకటించింది. దీనివల్ల ప్రీమియం ఫోన్ కొనాలని కోరిక ఉన్నవారు దీనిని కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 15 ధర కంటే.. ఐఫోన్ 16 ధర తక్కువగా ఉండడం విశేషం. అందులోనూ ప్రస్తుతం మరింత తగ్గింపు ధరతో ఇవ్వడంతో కొంతమంది కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper