The Rajasaab Advance Bookings: ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab Movie) మూవీ కి సంబంధించిన తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే మొదలైంది. ముందుగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. గుంటూరు, రాయలసీమ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, అప్పుడే రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టినట్టు తెలుస్తోంది. గుంటూరు సిటీ లో అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త యావరేజ్ రేంజ్ లోనే ఉన్నాయి. ఇక్కడ వెయ్యి రూపాయిల టికెట్ రేట్స్ ఎక్కువ అని జనాలు అనుకుంటున్నారేమో. ఇక రాయలసీమ లో మాత్రం ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తర్వాత రాయలసీమ లో హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ప్రభాస్ కి ఉంటుంది అని అందరూ అంటుంటారు. అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే అది నిజమే అని అనిపిస్తోంది.
ఇక బెంగళూరు లో కూడా ఈ చిత్రానికి పర్వాలేదు అని అనిపించే రేంజ్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీమియర్ షోస్ లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పాలంటే, రెండు రికార్డ్స్ ని దాటాల్సి ఉంటుంది. ఒకటి హరి హర వీరమల్లు, రెండు ఓజీ. ఈ రెండు పవన్ కళ్యాణ్ సినిమాలే అవ్వడం గమనార్హం. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 14 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ నుండి నమోదు అయ్యాయి. ఓవరాల్ ఇండియా వైడ్ గా 16 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. ‘రాజా సాబ్’ చిత్రానికి ఆ రేంజ్ గ్రాస్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఓజీ రేంజ్ గ్రాస్ అయితే ఈ సినిమా అందుకోవడం కష్టమని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఓజీ చిత్రానికి ఇండియా వైడ్ 31 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షోస్ కి 63 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంత మొత్తం రాబట్టడం కష్టమే. ‘రాజా సాబ్’ ప్రస్తుత టార్గెట్ ‘హరి హర వీరమల్లు’ అనుకోవచ్చు. ఈ రికార్డుని లేపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అందుకోవడం కాస్త కష్టమేమో కానీ, నైజాం లో మాత్రం అవలీల గా ‘హరి హర వీరమల్లు’ ని దాటొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ప్రీమియర్ షోస్ తో ప్రభాస్ ఏ రేంజ్ ర్యాంపేజ్ చేయబోతున్నాడు అనేది.