Apple iPhone 18 Pro: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది ఆపిల్ కంపెనీ తన ఐఫోన్ ఉత్పత్తిలో భాగంగా కొత్త సిరీస్ అందుబాటులో తీసుకొస్తుంది. దానికంటే ముందు అందులో ఉన్న ఫీచర్ల గురించి మీడియాకు లీకులు ఇస్తూ ఉంటుంది.. అయితే ఐఫోన్ 18 ప్రో (Apple iPhone 18 Pro) ను మార్కెట్లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తోంది.
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మోడల్ లో ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయని టెక్నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా అండర్ స్క్రీన్ ఫ్రంట్ కెమెరా అద్భుతం అని కొనియాడుతున్నారు. అండర్ స్క్రీన్ కెమెరా ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దృశ్య మార్పులు, కొత్త తరం కెమెరా సిస్టం, ప్రాసెసర్ పనితీరు, బ్యాటరీ జీవితకాలం.. ఇలా అనేక విషయాలలో ఆపిల్ కంపెనీ సరికొత్త మార్పులను తీసుకొచ్చిందని తెలుస్తోంది.
iPhone 18 Pro లో 6.3 అంగుళాల స్క్రీన్, ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్ లో 6.9 అంగుళాల స్క్రీన్ ఉంది. కెమెరా మాడ్యూల్.. గత సిరీస్ లతో పోల్చి చూస్తే మెరుగ్గా ఉంది. ప్రధానంగా mag safe చార్జింగ్ సదుపాయం యూజర్ లను ఆకట్టుకుంటుంది. Wireless charging ఈ మోడల్ లో ఉన్న ప్రధాన ఆకర్షణ. Face ID facial recognization system కు అవసరమైన సెన్సార్లు మొత్తం స్క్రీన్ కింది భాగంలో ఆపిల్ కంపెనీ అమర్చింది.
Display పూర్తిగా ఫ్లూయిడ్ యానిమేషన్ మాదిరిగా కనిపిస్తోంది. స్క్రోలింగ్ కు అనుకూలంగా ఈ మోడల్ తీర్చిదిద్దారు. 120 Hz promotion refresh rate, మెరుగైన OLED display టీ మోడల్ లో అందుబాటులో ఉంటుంది. కెమెరాలో వేరియబుల్ ఎపర్చర్ తో కూడిన ప్రధాన సెన్సార్ ఉంది. ఇది అద్భుతమైన విజన్ అందిస్తుంది. ఈ ఫీచర్ సాంసంగ్, హువాయ్ వంటి మోడల్స్ లో ఉన్నప్పటికీ.. essa lens aperture f/1.4 నుంచి f/2.0 స్థాయిలో అవి పని చేయలేవు.. కేవలం ఇవి మాత్రమే కాకుండా, ఏ 20 ప్రో చిప్, బ్యాటరీ ఆప్టిమైజేషన్, కూలింగ్ సిస్టం.. ఇంకా అనేక ఫీచర్లను ఆపిల్ కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది.