https://oktelugu.com/

Apple company : ఆఫర్ ప్రకారం ఐఫోన్ చార్జర్ ఇవ్వలేదు.. రూ.1. 29 లక్షల జరిమానా.. అసలేం జరిగిందంటే?

ఐఫోన్ కంపెనీ నుంచి తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఐ ఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఆఫర్లో ప్రకటించిన విధంగా కొన్ని వస్తువులు ఇవ్వలేదు. దీంతో ఆయన కన్జూమర్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆ కంపెపై రూ. 1,29, 900 జరిమానా విధించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : October 4, 2024 / 01:56 PM IST

    Apple company

    Follow us on

    Apple company : నేటి కాలంలో చాలా మంది అన్ లైన్ షాపింగ్ కు అలవాటు పడ్డారు. ఏ వస్తువు కొనుగోలు చేయాలని అనుకున్నా.. ఆమెజాన్, ప్లిప్ కార్డ్ లో సెర్చ్ చేస్తున్నారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడంతో ఈ షాపింగ్ మరింత క్రేజ్ అవుతోంది. అయితే ఎక్కువ శాతం వినియోగదారులు గాడ్జెట్స్ ను ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే కోరుకున్న విధంగా అవి అందుబాటులో ఉండవు. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ప్రత్యేక ఆఫర్ల ద్వారా విక్రయించడంతో లో బడ్జెట్ లో వీటిని పొందవచ్చు. తాజాగా ఐర్లాండ్ కంపెనీ ఐఫోన్ సేల్స్ ను ఆన్ లైన్ లో ఉంచింది. ఈ కంపెనీ నుంచి తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఐ ఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఆఫర్లో ప్రకటించిన విధంగా కొన్ని వస్తువులు ఇవ్వలేదు. దీంతో ఆయన కన్జూమర్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆ కంపెపై రూ. 1,29, 900 జరిమానా విధించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

    ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్న సమయంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు వేరేవి వస్తుంటాయి.దీంతో కొందరు పట్టించుకోరు. మరికొందరు మాత్రం సంబంధిత సంస్థలకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తారు. అయితే సంస్థలు తమ గుర్తింపు పాడవకుండా ఉండడానికి వినియోగదారులకు జరిగిన నష్టాన్ని పూడుస్తూ .. వేరే వస్తువులను అందిస్తుంటారు. లేదా అంతకు సమానంగా నష్ట నివారణ చేస్తారు. కానీ కొన్ని సంస్థలు మాత్రం ఎన్ని సార్లు కాంప్లేంట్స్ ఇచ్చినా పట్టించుకోరు. ఇలాంటి వాటి విషయంలో కన్జూమర్ ఫోరం వినియోగదారులకు అండగా నిలుస్తూ ఉంటుంది.

    వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో ఏదైనా నష్టం జరిగినప్పడు కన్జూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు. చాలా మంది వినియోగదారులకు జరిగిన నష్టపై కన్జూమర్ ఫోరం పరిహారం అందించింది. అంతేకాకుండా వస్తుసేవల కొనుగోలు విషయంలో అన్యాయం జరిగితే వారికి అండగా ఉంటూ వస్తోంది. దీంతో చాలా మంది తమకు ఏదైనా నష్టం జరిగితే వెంటనే వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తూ ఉంటారు. తాజాగా విజయవాడాకు చెందిన ఓ వ్యక్తి తనకు జరిగిన నష్టంపై కాకినాడలోని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

    ఐర్లాండ్ కు చెందిన యాపిల్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొన్ని ఆఫర్లను ప్రకటించింది. యాపిల్ కంపెనీకి చెందిన ఫోన్ కొన్న వారికి రూ.14,900 చార్జింగ్ కేస్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. దీంతో విజయవాడకు చెందిన చందలాడ పద్మరాజు ఈ ఫోన్ ను 2021 అక్టోబర్ 13న ఆర్డర్ చేవాడు. అయితే తాను ఆర్డర్ చేసిన విధంగా యాపిల్ ఫోన్ వచ్చింది. కానీ అందులో చార్జింగ్ కేస్ లేదు. దీంతో పద్మరాజు సంబంధిత కంపెనీకి ఫోన్ చేశాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా వారు రెస్పాండ్ కాలేదు. దీంతో వారు పట్టించుకోకపోవడంతో 2024 ఫిబ్రవరి 15న కాకినాడ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. దీంతో వినియోగదారుల ఫోరం పద్మరాజుకు అండగా నిలిచింది. సదరు కంపెనీకి రూ.1,29,900 జరిమానా విధించింది.