https://oktelugu.com/

Cyber Fraud: కొత్తరకం సైబర్‌ మోసం.. సానుభూతి కథలతో ఆర్థికసాయానికి వినతి.. ఖాతాలు గుర్తించి రూ.1.60 లక్షలు ట్రాప్

సైబర్, ఆన్‌లైన్‌ మోసాలు ఎప్పుడు ఎలా ఎదురవుతాయో తెలియని పరిస్థితి. రోజుకో దేశంలో నిత్యం వందలాది మోసాలు జరుగుతున్నాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మోసాగు ఆగడం లేదు

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 4, 2024 / 01:46 PM IST

    Cyber Fraud

    Follow us on

    Cyber Fraud: సాంకేతికత పెరిగే కొద్ది మోసాలూ పెరుగుతున్నాయి. ఫోన్‌లకు మెస్సేజ్‌ల రూపంలో లింక్‌లు పంపిస్తూ.. బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది పేరిట ఫోన్‌ చేసి ఓటీపీ నంబర్లు సేకరించి ఖాతాను కొల్లగొడుతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌ల పేరిత మరికొందరు మోసం చేస్తున్నారు. ఆర్థికసాయం చేయాలని, పూజలకు డబ్బులు చెల్లించాలని ఇలా అనేక రూపాల్లో లింగ్‌కు పంపుతున్నారు. కొందరు పార్ట్‌టైం జాబ్‌ పేరిట లిక్‌ ఫోన్లకు పంపి మోసం చేస్తున్నారు. చదువు రానివారితోపాటు ఉన్నత విద్యావంతలు కూడా మోసాలబారిన పడుతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ ఎన్నారై కుటంబం సైబర్‌ మోసంలో రూ.1.60 లక్షలు పోగొట్టుకుంది. ఓ స్కామర్‌ హృదయాన్ని కదిలించే కథతో భారతదేశంలోని తన కుటుంబానికి అత్యవసరంగా డబ్బు పంపడంలో సాయం చేమని కోరి మోసానికి పాల్పడ్డాడు.

    ఏం జరిగిందంటే..
    తన కుటుంబానికి అత్యంసరంగా డబ్బులు అవసరం ఉందని మనసును కదిలించే కథను అల్లాడు ఓ సైబర్‌ మోసగాడు. ఈమేరకు బెంగళూరకు చెందిన ఎన్నారైకి ఫోన్‌ చేసి అభ్యర్థించాడు. కరిగిపోయిన సదరు ఎన్నారై.. సైబర్‌ మోసగాడు చెప్పిన ఖాతాకు తన స్నేహితుడి నుంచి బదిలీ చేచించాడు. లావాదేవీలు పూర్తయిన వెంటనే తన భార్య నుంచి వాయిస్‌ నోట్స్, వారి ఖాతాలో నగదు జమ చేసినట్లు నకిలీ బ్యాంక్‌ రసీదును అడిగాడు. అయితే లావాదేవీ జరిగిన వెంటనే, స్కామర్‌ అన్ని కమ్యూనికేషన్‌ మార్గాల నుంచి కుటుంబాన్ని బ్లాక్‌ చేశాడు. దీంతో మోసపోయామని గుర్తించిన ఎన్నారై కుటుంబం ఇపుపడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    విచారణ జరుపుతున్న పోలీసులు..
    ఫిర్యాదు మేరకు సైబర్‌ పోలీసులు విచారణ చేపట్టారు. కర్ణాటకలోని యూనియన్‌ బ్యాంకులో మోసగాడి ఖాతాను గుర్తించి ట్రాన్స్‌ చేయడానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. సానుకూల కారణాలతో కూడా ఎవరైనా అత్యవసర ఆర్థిక అభ్యర్థనను పొందినట్లయితే, అది మోసానికి దారితీయవచ్చని ఇతరులను హెచ్చరించింది. అయితే అనుమానితుడిని పట్టుకోవడంలో కుటుంబం మరింత మార్గదర్శకత్వం సహాయం కోరుతోంది. ప్రపంచంలోని పెద్ద స్కామ్‌ ఆర్టిస్టులకు వ్యతిరేకంగా సానుభూతితో వ్యవహరించే వారి దుర్బలత్వాన్ని ఈ విషాదకరమైన కేసు విచారకరమైన రిమైండర్‌గా పనిచేస్తుంది.