New Car: జీఎస్టీ తగ్గిన తర్వాత వస్తువుల ధరలు చాలావరకు తగ్గాయి. దీంతో చాలామంది తమకు కావాల్సిన కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి షాప్ లేదా షోరూంకు వెళ్తున్నారు. ఇదే సమయంలో పండుగ సీజన్ కావడంతో కొత్త వసూలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దసరా, దీపావళి సందర్భంగా చాలామంది కార్లు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. ముఖ్యంగా దీపావళికి కొత్త కారు కొనాలని చూసేవారు చాలామంది ఉంటారు. జీఎస్టీ 2.0. తర్వాత కొన్ని కార్ల ధరలు విపరీతంగా తగ్గాయి. అంతేకాకుండా కొన్ని విషయాల్లో కూడా వేల రూపాయల డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
జీఎస్టీ తగ్గింపు తర్వాత షోరూం లల్లో కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. జీఎస్టీ 2.0 తర్వాత మారుతి కంపెనీకి చెందిన ఆల్టో.. టాటా కంపెనీకి చెందిన టియాగో.. కియా కంపెనీకి చెందిన సెల్టో కార్లు విపరీతంగా విక్రయాలు జరుపుకున్నట్లు కొన్ని లెక్కలను బట్టి తెలుస్తోంది. మారుతి ఆల్టో కారు గతంలో కంటే రూ.1,07,000 వరకు తగ్గింది. టాటా టియాగో కారు రూ.75,000 తగ్గింది. అలాగే కియా కంపెనీకి చెందిన సెల్టో రూ.75,000 తగ్గించారు. దీంతో కొత్తగా కారు కొనాలని అనుకునేవారు.. మిడిల్ క్లాస్ పీపుల్స్ ఈ కార్ల కోసం ఎగబడుతున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ మరో 20 నుంచి 30 వేల రూపాయల వరకు తగ్గించుకునే మార్గం కూడా ఉంది. అదేంటంటే?
కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వారు అయితే రూ. 50,000 వరకు వసూలు చేస్తారు. కానీ కొన్ని ఆన్లైన్ ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.20,000 లోపే ఛార్జ్ చేస్తారు. అందువల్ల కారు కొనుగోలు చేసేటప్పుడు ఇన్సూరెన్స్ షోరూం లో కాకుండా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి. కారు కొనే చోటే ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న రూల్ ఏమి లేదు. ఎందుకంటే షోరూం వాళ్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. అయితే ఈ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరు తక్కువ ధర అని చెప్పి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్లో ఎలాంటి ప్రమాదాలు వర్తిస్తాయో కూడా పూర్తిగా తెలుసుకోవాలి.
ప్రస్తుతం చాలా షోరూం లో ఆన్ రోడ్ ప్రైసెస్ చాలా వరకు తగ్గాయి. అయితే ఇందులో అదనంగా ఫీచర్స్ ఆడ్ చేసుకుంటే అదనంగా డబ్బులు అయ్యే అవకాశం ఉంటుంది. అవసరం లేని వాటిని కొనుగోలు చేసి డబ్బులు వృథా చేసుకోవద్దు. కారు కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ 2.0 వర్తిస్తుందా? లేదా? అనేది పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే కొందరు పాత ధరకే విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఎవరైనా మోసం చేస్తే జిఎస్టి కౌన్సిల్ కు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది.