https://oktelugu.com/

Anant Ambani Pre Wedding: అంబానీల పెళ్లి.. గుడారాల్లో వీఐపీల విడది.. అవి ఎలా ఉన్నాయో తెలుసా?

ముఖేష్‌ అంబానీ–నీతా అంబానీలు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రీవెడ్డింగ్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 3, 2024 / 04:37 PM IST

    Anant Ambani Pre Wedding

    Follow us on

    Anant Ambani Pre Wedding: వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబాని చిన్న కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి ఈ నెలలో జరుగనుంది. ఈ సందర్భంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీవెడ్డింగ్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు. గురువారం ప్రారంభమైన ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలను ఆహ్వానించారు.

    రూ.వెయ్యి కోట్లతో..
    ముఖేష్‌ అంబానీ–నీతా అంబానీలు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రీవెడ్డింగ్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు. దేశంలోని సినిమా స్టార్స్, స్పోర్ట్స్‌ స్టార్స్, వ్యాపార దిగ్గజాలు, విదేశాలకు చెందిన ఆటగాళ్లు, వ్యాపారులు, బిజినెస్‌ టైకూన్లు ఈ వేడుకలకు వస్తున్నారు. వేడుకల్లో భాగంగా తొలిరోజు 50 వేల మందికి అన్నదానం చేశారు. రెండో రోజు వేడుకలకు వీవీఐపీలు, వీఐపీలు హాజరయ్యారు.

    అతిథులకు గుడారాలు..
    జరుగుతున్నది ముఖేష్‌ అంబానీ కొడుకు ప్రీవెడ్డింగ్‌ వేడుక. ఈ వేడుకల ఏర్పాట్లను నీతా అంబానీ నాలుగు నెలలుగా ప్లాన్‌ చేశారు. అంటే మామూలుగా ఉంటుందా.. అయితే జామ్‌నగర్‌కు వస్తున్న సెలబ్రిటీలకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయం వద్దనే స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇక వేడుక ప్రదేశంలో ప్రముఖుల విడిది కోసం గుడారాలు ఏర్పాటు చేశారు. బయటి నుంచి చూస్తే సాదా సీదాగా కనిపించే ఈ గుడారాల్లోనే వీవీఐపీలు ఉంటున్నారు. కానీ లోపలికి వెళ్లి చూస్తే కళ్లు తిరగడం ఖాయం. రెండు గదులు ఉన్న గుడారాల్లో ముందు గదిలో సోఫాలు, కుర్చీలే ఏర్పాటు చేశారు. గెస్ట్‌లు వస్తే మాట్లాడుకునేలా ఉన్నాయి. ఇక రెండో గదిలో బెడ్, సోఫా, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్‌ ఇలా సకల సౌకర్యాలు కల్పించారు. దీనికి సంబంధించిన వీడియోను బ్యాడ్‌మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.