https://oktelugu.com/

ఎల్ఐసీ సూపర్ స్కీమ్.. నెలకు రూ.14 వేలు పెన్షన్ పొందే ఛాన్స్..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇతర పాలసీలతో పోలిస్తే ఒక పాలసీలో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తం పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. లైఫ్ లాంగ్ పెన్షన్ పొందాలని అనుకునే వాళ్లు ఎల్ఐసీ ‘జీవన్ అక్షయ్’ యాన్యుటీ పాలసీ ను తీసుకుంటే మంచిది. 30 నుంచి 85 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. Also Read: భారీగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2021 12:23 pm
    Follow us on

    LIC Jeevan Akshay Scheme

    దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇతర పాలసీలతో పోలిస్తే ఒక పాలసీలో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తం పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. లైఫ్ లాంగ్ పెన్షన్ పొందాలని అనుకునే వాళ్లు ఎల్ఐసీ ‘జీవన్ అక్షయ్’ యాన్యుటీ పాలసీ ను తీసుకుంటే మంచిది. 30 నుంచి 85 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు.

    Also Read: భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ..?

    బ్యాంక్ లతో పోలిస్తే ఈ పాలసీ ద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కనిష్టంగా లక్ష రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ పాలసీలో పెట్టుబడిగా పెట్టవచ్చు. గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల ఎంత మొత్తమైనా ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. లక్ష రూపాయలు ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 1,000 రూపాయల చొప్పున పెన్షన్ వస్తుంది. 6,10,800 రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.6 వేలు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు కేంద్రం శుభవార్త.. అలా జరిగితే రూ.5 లక్షలు..?

    30 లక్షల రూపాయలు ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెలకు 14,000 రూపాయలు పెన్షన్ పొందవచ్చు. పాలసీదారుడు జీవించినంత కాలం పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు మరణించిన తరువాత పెన్షన్ ఆగిపోయినా పెట్టుబడిని నామినీ పొందే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం ఈ పెన్షన్ స్కీమ్‌ లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వారికి పన్ను మినహాయింపు లభిస్తుంది.

    మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము

    మరింత ఎక్కువ పెన్షన్ పొందాలని అనుకునే వాళ్లు ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయవచ్చు. సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను లేదా ఎల్ఐసీ ఏజెంట్ ను సంప్రదించి ఈ పెన్షన్ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.