
ప్రముఖ ఈకామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ డిగ్రీ చదివి ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. 5,000 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం అమెజాన్ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అమెజాన్ సెల్లార్ సపోర్ట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పని చేయాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇంగ్లీష్ పై పట్టు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
https://amazonvirtualhiring.hirepro.in/registration/incta/ju0f4/apply/?j=56345&e=12199 వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లకు 2,75,000 రూపాయల నుంచి 4,00,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తరువత అప్లికేషన్ ను ధృవీకరిస్తూ మెయిల్ వస్తుంది. ఆ తర్వాత ఆన్ లైన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ పరీక్షలో ఎక్కువగా ఇంగ్లీష్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని సమాచారం. ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ జరిగే సమయంలో ఇంటర్నెట్ ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డిగ్రీ చదివిన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.