https://oktelugu.com/

Amazon Sale: కస్టమర్లకు అమెజాన్ బంపర్ ఆఫర్.. వాటిపై భారీ డిస్కౌంట్..?

Amazon Sale: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌(Amazon) కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. అతి త్వరలో అమెజాన్ కస్టమర్ల కోసం మరో సేల్(Sale) ను తీసుకురానుంది. ఈ సేల్ లో కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. అమెజాన్ ఈ నెల 24వ తేదీ వరకు గ్రాండ్ గేమింగ్ డేస్ పేరుతో సేల్ ను ప్రకటించగా ల్యాప్‌టాప్స్‌, టీవీలు డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, అధునాతన హెడ్‌ఫోన్‌లు, గేమింగ్ కన్సోల్‌, గ్రాఫిక్ కార్డులపై భారీ డిస్కౌంట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 23, 2021 / 11:27 AM IST
    Follow us on


    Amazon Sale: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌(Amazon) కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. అతి త్వరలో అమెజాన్ కస్టమర్ల కోసం మరో సేల్(Sale) ను తీసుకురానుంది. ఈ సేల్ లో కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. అమెజాన్ ఈ నెల 24వ తేదీ వరకు గ్రాండ్ గేమింగ్ డేస్ పేరుతో సేల్ ను ప్రకటించగా ల్యాప్‌టాప్స్‌, టీవీలు డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, అధునాతన హెడ్‌ఫోన్‌లు, గేమింగ్ కన్సోల్‌, గ్రాఫిక్ కార్డులపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

    ప్రముఖ కంపెనీలకు చెందిన టీవీలపై కూడా అమెజాన్ భారీ డిస్కౌంట్లను అందిస్తోందని తెలుస్తోంది. డెల్, కోర్సెయిర్, కాస్మిక్ బైట్, జేబీఎల్‌ కంపెనీలకు సంబంధించిన ప్రాడక్ట్స్ పై 30 శాతం డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. రిఫ్రెష్‌ రేట్‌, ర్యామ్ ఎక్కువగా ఉన్న టీవీలను సైతం తక్కువ ధరకే అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. నో-కాస్ట్‌ ఈఎమ్‌ఐ, ఎక్సేఛేంజ్‌ ఆఫర్‌లను కూడా అమెజాన్ అందిస్తుండటం గమనార్హం.

    హెచ్‌పీ కంపెనీ గేమ్ ల్యాప్ టాప్ ధర 66,990 రూపాయలు కాగా ఏసర్ కంపెనీకి చెందిన గేమింగ్ ల్యాప్ టాప్ 69,990 రూపాయలుగా ఉంది. ఎమ్‌ఎస్‌ఐ కంపెనీకి చెందిన బ్రావో 15 ఎఫ్‌హెచ్‌డీ మోడల్‌ ధర 74,990 రూపాయలుగా ఉంది. లెనోవా ఐడియా ప్యాడ్‌ ల్యాప్‌టాప్‌ 67,557 రూపాయలకు పొందే అవకాశాలు ఉంటాయి. ఖరీదైన స్మార్ట్ టీవీలపై కూడా అమెజాన్ ద్వారా డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంటుంది.

    సోనీ బ్రావీయా 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీ ధర 83,990 రూపాయలుగా ఉంది. రెడ్‌మీ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ ధర 45,999 రూపాయాలకే పొందే అవకాశం ఉంటుంది.