Amazon Great Summer Sale Offers: పండుగలు, పర్వదినాల్లో మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సైతం ఈ కామర్స్ సంస్థలు వినియోగదారలను ఆకర్షించేందుకు బంఫర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ‘అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్’ (Amazon Great Summer Sale) ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశంగా చెప్పుకుంటున్నార. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్, లాప్‌టాప్‌లతో పాటు ముఖ్యంగా టాబ్లెట్లపై ఊహించని రీతిలో భారీ డీల్స్, ఆఫర్లతో పాటు ఆకర్షణీయమైన తగ్గింపులను అమెజాన్ అందిస్తోంది. ఆ వివరాలు మీకోసం..
ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్లపై అమెజాన్ ఏకంగా 40 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో భాగంగా శామ్‌సంగ్ (Samsung), షియోమీ (Xiaomi), లెనోవో (Lenovo) వంటి ప్రముఖ ఆండ్రాయిడ్ బ్రాండ్లకు చెందిన సరికొత్త మోడళ్లు బడ్జెట్ ధరలకే అందుబాటులోకి వచ్చాయి. ఆండ్రాయిడ్ వినియోగదారులకే కాకుండా, ప్రీమియం లుక్, పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం యాపిల్ ఐప్యాడ్ (Apple iPad) మోడళ్లపై కూడా ఈ సేల్‌లో ప్రత్యేక తగ్గింపులు లభిస్తున్నాయి.
ఉదాహరణకు వన్ ప్లస్ ప్యాడ్ లైట్ (OnePlus Pad Lite)వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ అసలు ధర రూ. 19,999 కాగా.. Amazon Great Summer Sale సందర్భంగా వినియోగదారులు దీనిని కేవలం రూ. 16,999 కే సొంతం చేసుకోవచ్చు. దీనికి తోడు, పాత మొబైల్స్ మార్చుకోవాలనుకునే వారి కోసం అమెజాన్ ఏకంగా రూ. 16,050 వరకు భారీ ఎక్స్‌చేంజ్ తగ్గింపును కూడా అందిస్తోంది. ఒకేసారి అంత డబ్బు చెల్లించలేని వారి కోసం ఎలాంటి అదనపు వడ్డీ లేని నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇప్పటికే OnePlus Pad Lite వినియోగదారుల నుంచి ఆదరణ పొందుతోంది. ఫీచర్ల పరంగా చూస్తే, ఈ వన్‌ప్లస్ టాబ్లెట్ వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఇది పెద్ద 11 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతో చదువుకోవడానికి, సినిమాలు చూడటానికి, ఆఫీస్ పనులకు చక్కగా సరిపోతుంది. అంతేకాకుండా, ఇందులో అమర్చిన శక్తివంతమైన 9,340mAh బ్యాటరీ వినియోగదారులకు సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది, తద్వారా పదే పదే ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా రోజంతా నిరంతరాయంగా వాడుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. ఈ సేల్‌లో కొనుగోలుదారులు మరింత ఎక్కువ ఆదా చేసుకునేందుకు అమెజాన్ మంచి అవకాశం కల్పించింది. హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్ కార్డు వినియోగదారులు క్రెడిట్ కార్డు ద్వారా లేదా EMI లావాదేవీల ద్వారా కొనుగోళ్లు జరిపితే అదనంగా 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
