spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Kalvakuntla Kavitha Comments: అక్కడ విజయ్‌.. ఇక్కడ నేను.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు!

Kalvakuntla Kavitha Comments: అక్కడ విజయ్‌.. ఇక్కడ నేను.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు!

Kalvakuntla Kavitha Comments: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేశమంతా బెంగాల్‌వైపు చూసింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఈసారి బీజేపీ ఓడించాలన్న ఆసక్తి అందరిలో కనిపించింది. ఇక ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కూడా అలాగే వచ్చాయి. తమిళనాడులో మరోమారు డీఎంకే అధికారంలోకి వస్తుందని అంచనా వేవాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి.. ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దళపతి విజయ్‌. అనూహ్యంగా టీవీకే ఈ ఎన్నిల్లో 107 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కాంగ్రెస్, సీపీఎం, ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. 2028లో తెలంగాణలో తమిళనాడు సీన్‌ రిపీట్‌ అవుతుందన్నార తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత. ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశం అయింది.

తమిళనాడు మోడల్‌..
తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత వంటి సినిమా నటులు రాజకీయాల్లో విజయం సాధించిన చరిత్ర ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దళలపతి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ బలమైన డ్రావిడ పార్టీల (డీఎంకే, ఏఐఏడీఎంకే) ఆధిపత్యాన్ని సవాలు చేసి, సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. యువత, ఫ్యాన్‌ బేస్, సామాజిక మీడియా, కొత్త ఆలోచనలతో విజయ్‌ అధికార పీఠం దగ్గరకు చేరుకున్నారు. కవిత ఈ మోడల్‌ను తెలంగాణకు అన్వయించాలని చూస్తున్నారు. తమిళ ప్రజలు కొత్త యువ నాయకత్వాన్ని కోరుకున్నట్లే, తెలంగాణలో కూడా అదే జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆశావాదం కాదు తెలంగాణ ఉద్యమ చరిత్ర, యువత అసంతృప్తి, మార్పు కోరుకునే వాతావరణాన్ని ఆమె లక్ష్యంగా చేసుకున్నారు.

కవిత రాజకీయ ప్రయాణం కొత్త అధ్యాయం..
కల్వకుంట్ల కవిత తెలంగాణ మాజీ సీఎం కుమార్తె. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ, ఎమ్మెలీ. తండ్రి పార్టీలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న ఆమె, ఇటీవల తన సొంత పార్టీ తెలంగాణ రక్షణ సేనను (టీఆర్‌ఎస్‌) ఏప్రిల్‌ 25న ప్రకటించారు. ఇది తండ్రి కేసీఆర్‌తో రాజకీయ వ్యత్యాసాల నేపథ్యంలో పెట్టిన పార్టీ. పార్టీ ప్రకటించిన రోజే కవిత యువత, రైతులు, విద్యార్థులు, పేద, మధ్య తరగతి ప్రజలు, బీసీలను లక్ష్యంగా చేసుకుని పాంచజన్యం పూరించారు. అయితే ఉచిత విద్యా, వైద్యం అందించడం అంత ఈజీ కాదని విశ్లేషకులు అంటున్నారు. కవిత మాత్రం తమ పాంచజన్యాలే గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు.

తెలంగాణ తరహా అసాధ్యం..
తమిళనాడు తరహా రాజకీయాలు, ప్రజల ఆలోచనా విధానం తెలంగాణలో ఉండదు. కవిత ఆశించిన విధంగా ఇక్కడి ఓటర్లు ఏకపక్షంగా ఓటు వేయరు. కవిత ఇచ్చిన హామీలు తెలంగాణలో అమలు కూడా సాధ్యం కాదు. కవిత రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వస్తున్నారు. తమిళనాడులో ద్రవిడ పార్టీల ద్విపక్ష వ్యవస్థ బలహీనపడింది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య పోటీ ఉంది. విజయ్‌ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. కవితకు ఇంకా ఎన్నికల పరీక్ష ఎదుర్కొనలేదు.తెలంగాణలో రైతు సమస్యలు, ఉద్యోగాలు, సంస్కృతి రక్షణ వంటి స్థానిక అంశాలు కవిత ఎజెండాలో కీలకం కావచ్చు.

కవిత ప్రకటన యువతలో ఆశలు రేకెత్తించవచ్చు, కానీ వాస్తవాలు కఠినం. తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు, పార్టీల మధ్య పోటీ, ఆర్థిక–సామాజిక సమస్యలు ఉన్నాయి. విజయ్‌ విజయం సినిమా ప్రభావం, టైమింగ్‌ వల్ల సాధ్యమైంది. కవితకు ఇలాంటి మ్యాజిక్‌ ఉంటుందా అనేది భవిష్యత్‌ ఎన్నికలు నిర్ణయిస్తాయి. అయినా, కొత్త నాయకత్వం రావడం రాజకీయ వైవిధ్యాన్ని పెంచుతుంది. ప్రజలు మార్పును అంగీకరిస్తే, తెలంగాణలో కూడా కొత్త అధ్యాయం మొదలవవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version