రైతులకు అలర్ట్.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే రూ.6 వేలు పొందే ఛాన్స్?

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ను మోదీ సర్కార్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2018 సంవత్సరం నుంచి మోదీ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుండగా ఈ మొత్తం మూడు విడతలలో రైతుల ఖాతాలలో జమ కానుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం దేశంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో […]

Written By: Kusuma Aggunna, Updated On : October 24, 2021 3:12 pm
Follow us on

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ను మోదీ సర్కార్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2018 సంవత్సరం నుంచి మోదీ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుండగా ఈ మొత్తం మూడు విడతలలో రైతుల ఖాతాలలో జమ కానుండటం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం దేశంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటుండగా కొంతమంది రైతులకు మాత్రం అర్హత ఉన్నా ఖాతాలలో నగదు జమ కావడం లేదు. దరఖాస్తు విషయంలో చేసే చిన్నచిన్న తప్పులు రైతుల ఖాతాలలో నగదు జమ కాకపోవడానికి కారణమవుతున్నాయి. అయితే రైతుల ఖాతాలో నగదు జమ కాకపోతే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఆధార్ సీడింగ్ జరగకపోయినా ఏదైనా కారణం చేత భూ రికార్డు తిరస్కరణకు గురైనా నగదు జమ కావాల్సిన బ్యాంకు ఖాతాను ఏదైనా కారణం చేత మూసివేసినా రైతు రికార్డును పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆమోదించకపోయినా ఖాతా నంబర్ ను ఎంటర్ చేసిన సమయంలో తప్పుగా ఇచ్చినా ఖాతా హోల్డ్ లో ఉండినా ఈ విధంగా జరుగుతోంది.

తప్పులను సరిదిద్దుకోవాలని భావించే వాళ్లు www.pmkisan.gov.in వెబ్ సైట్ ను సందర్శించి తప్పులు సరిదిద్దుకుంటే మంచిది. లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేసి వివరాలను తనిఖీ చేసి సులభంగా తప్పులను సరి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.