SBI Customer Alert : ప్రస్తుత కాలంలో ప్రతీ వ్యవహారం డబ్బుతో ముడిపడి ఉంది. ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలన్నా.. ఎక్కడికైనా ప్రయాణించాలన్నా కరెన్సీ కంపల్సరీ. వస్తు మార్పిడి నుంచి వెయ్యి రూపాయల నోటు వరకు నగదుకు సంబంధించిన వివిధ వ్యవహారాలు జరిగేవి. అయితే టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ప్రతిదీ ఆన్ లైన్ లోనే నగదు వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఈమధ్య చాలా మంది చేతిలో డబ్బులు తీసుకెళ్లడం లేదు. ఫోన్ పే, గూగుల్ పే లేదా ఇతర మనీ యాప్ ట్రాన్జాక్షన్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. చేతి ద్వారా నగదు మారకం కంటే ఆన్ లైన్ నగదు ట్రాన్జాక్షన్ చాలా ఈజీ. ప్రపంచంలో ఎక్కడి వ్యక్తికైనా నిమిషాల్లో లిమిట్ లేకుండా నగదు పంపించవచ్చు. అయితే ఇక్కడ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆన్ లైన్ నగదు వ్యవహారాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో కొందరు సైబర్ నేరగాళ్లు అమాయకులను ఆసరాగా చేసేకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. వారికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకొని అక్రమంగా నగదును దోచుకుంటున్నారు. ఓటీపీ, తదితర వివరాలు తెలుసుకొని నగదును తస్కరించిన సంఘటనలు అనేకం చూశాం. అయితే తాజాగా కొందరు సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసం చేస్తున్నారు. కొందరు ఎక్కువగా నగదు వ్యవహారాలు జరిపే వారికి కొందరు విచిత్రమైన లింక్ లు పంపిస్తున్నారు. ఈ లింక్ ద్వారా మీరు లాభం పొందుతారు.. అని మెసేజ్ పెట్టడం వల్ల కొందరు అవగాహన లేకుండా వాటిని ఓపెన్ చేస్తున్నారు. ఆ తరువాత డబ్బును కోల్పోతున్నారు. అయితే ఈ మోసం ఎలా ఉంటుందంటే?
ప్రస్తుతం ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ వ్యవహారాలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈ రకమైన చెల్లింపులు చేయాలంటే డెబిట్ కార్డు సమాచారం అందించాల్సి ఉంటుంది. అంటే మనీ ట్రాన్జాక్షన్ యాప్ ను డెబిట్ కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డెబిట్ కార్డుకు రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ కు కార్డుకు సంబంధించిన మెసేజ్ లను డెబిట్ కార్డు అందించిన బ్యాంకు మెసేజ్ లను అందిస్తూ ఉంటుంది.
డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు వాడిన నేపథ్యంలో కొన్నిరివార్డు పాయింట్స్ వస్తుంటాయి. వీటిని మనీగా మార్చుకోవచ్చు. లేదా ఈ పాయింట్స్ తో ఏదైనా వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఈ తరుణంలో కొందరు సైబర్ నేరగాళ్లు వివిధ మెసేజ్ లు పంపించి రివార్డ్ పాయింట్స్ పొందాలని కొన్ని లింక్స్ పంపిస్తున్నారు. ఈ లింక్ చివరగా.. .apk అని ఉంటుంది. వీటిని ఓపెన్ చేయగానే కార్డు దారి డిటేయిల్స్ మోసగాళ్లకు చేరుతుంది. దీంతో వారు పరోక్షంగా కార్డుకు సంబంధించిన డీటేయిల్స్ తెలుసుకొని వారి మనీని దోచుకుంటున్నారు.
ఒక తాజాగా ఇలాంటి లింక్స్ పంపించి రివార్డ్ పాయింట్స్ పొందాలంటే క్లిక్ చేయాలని అంటున్నారు. అయితే ఈ లింక్ క్లిక్ చేయగానే ఓ యాప్ ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఓపెన్ చేస్తారు. ఈ లింక్ తన కాంటాక్ట్ నెంబర్స్ కు వాట్సాప్ ద్వారా వెళ్లిపోతుంది. దీంతో పరోక్షంగా మోసగాళ్లు బ్యాంకు ఖాతాదారుడి కాంటాక్ట్స్ కు ఈ మెసేజ్ పంపిస్తున్నారు. అయితే ఈ మెసేజ్ ఓపెన్ చేయగానే ఓ యాప్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఒక ఓటీపీ వస్తుంది.దీనిని ఎంట్రీ చేస్తే బ్యాంకు డిటేయిల్స్ మొత్తం నేరగాళ్లకు వెళ్లిపోతాయి.
అందువల్ల .apk అనే మెసేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి రివార్డ్ మెసేజ్ అయినా సంబంధిత బ్యాంకు యాప్ లేదా నేరుగా అధికారులను గానీ సంప్రదించి పొందాలని సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకే వస్తుందని కొందరు తెలుపుతున్నారు. అందువల్ల ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More