Digital TV
Digital TV : దేశంలో వివిధ కంపెనీలు మెర్జ్ కావడం కామన్.. ఒక కంపెనీలో వాటాను మరో కంపెనీ కొనుగోలు చేస్తుంది. ఇలా వొడాఫోన్, ఐడియా విలీనం అయ్యాయి. ఇటీవల జియో సినిమా(Jio Cinima), డిస్నీ + హాట్‌స్టార్(Disny + Hot star) విలీనమయ్యాయి. ఇదే క్రమంలో రెండు దేశీయ వ్యాపార సంస్థలు ఒక్కటి కావాలని నిర్ణయించాయి. ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. ఓటీటీలు, లైవ్ స్ట్రీమింగ్‌లు పెరుగుతున్నాయి. ఈక్రమంలో డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) వినియోగదారుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే గణనీయంగా పడిపోయింది. గతంలో కేబుల్ టీవీ కనెక్షన్ ఉన్నవారంతా డీటీహెచ్(DTH)వైపు మళ్లారు. ప్రస్తుతం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, లైవ్ స్ట్రీమింగ్‌లు, లైవ్‌టీవీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో డీటీహెచ్‌ల పరిస్తితి మారిపోతోంది. ఆదరణ కరువవుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో అతిపెద్ద డీటీహెచ్ అయిన టాటా ప్లే, మరో సంస్థ ఎయిర్‌టెల్ డిజిటల్‌తో మెర్జ్ కావాలని నిర్ణయించాయి.
జియో హాట్‌స్టార్‌కు దీటుగా..
ఇటీవలే జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్ విలీనమయ్యాయి. జియో హాట్‌స్టార్‌గా మారిపోయాయి. దీనికి దీటుగా ఇప్పుడు ఎయిల్‌టెల్ డిజిటల్, టాటా ప్లే విలీనం కానున్నాయి. ఈమేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇదే జరిఇతే డీటీహెచ్ టాటా ప్లే, ఎయిర్‌టెల్ డిజినటల్ ఈవీ ఒక్కటవుతాయి. ఈ విలీనం కోసం ఇపపటికే ఇరు సంస్థలు చచ్చలు జరుపుతున్నాయి. షేర్ల మార్పిడి ద్వారా ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, టాటాప్లే విలీనం జరుగుతాయని తెలిపారు. విలీనం జరిగితే ఇందులో ఎయిర్‌టెల్ వాటా ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఎయిర్‌టెల్ సంస్థ తన బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించేందకు ఈ డీల్ ఉపయోగపడుతుంది. ఈ విలీనం కారణంగా ఎయిర్‌టెల్‌కు నాన్ మొబైల్ సెగ్మెంట్ నుంచి వ్చే ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందం జరిగితే 2 కోట్ల టాటా ప్లే కనెక్షన్లకు ఎయిర్‌టెల్ తన సేవలను అందిస్తుంది. డీటీహెచ్ ఆదరణ తగ్గుతున్న వేళ ఈ విలీనం ప్రాధాన్యత సంతరించుకుంది.
టాటా స్కై.. టాటా ప్లేగా..
దేశంలో అతిపెద్ద డీటహెచ్ ప్రొవైడర్‌గా ఉన్న టాటా స్కై.. కొన్నేళ్ల క్రితం టాటా స్కై.. టాటా ప్లేగా మారింది. న్యూస్‌కార్ప్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. 2019లో జరిగిన డీల్‌తో టాటా ప్లేలోని కొంత వాటాను వాల్డ్ డిస్న దక్కించుకుంది. టాటా ప్లే, ఎయిర్‌లెట్(Air tel)డిజిటల్ విలీనమైన కంపెనీ బాధ్యతలను ఎయిర్‌టెల్ సీనియర్ మేనేజ్మెంట్ చూసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Web Title: Airtel tied up with tata play digital tv soon
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com