https://oktelugu.com/

ఎయిర్ టెల్ సిమ్ కార్డ్ ఉందా.. రూ.4 లక్షల బెనిఫిట్ పొందే ఛాన్స్..?

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు ఎయిర్ టెల్ సిమ్ కార్డును వాడుతున్నారు. ఎయిర్ టెల్ కస్టమర్లకు కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 4 లక్షల రూపాయల బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది. 179 రూపాయలు, 279 రూపాయల రీఛార్జ్ ప్లాన్లపై ఈ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. రూ.179 ప్లాన్‌పై 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 7, 2021 8:54 pm
    Follow us on


    దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు ఎయిర్ టెల్ సిమ్ కార్డును వాడుతున్నారు. ఎయిర్ టెల్ కస్టమర్లకు కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 4 లక్షల రూపాయల బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది. 179 రూపాయలు, 279 రూపాయల రీఛార్జ్ ప్లాన్లపై ఈ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది.

    రూ.179 ప్లాన్‌పై 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉండగా రూ.279 ప్లాన్‌పై 4 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. రెండు ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఫ్రీగా లైఫ్ ఇన్సూరెన్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. రూ.279 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా పొందే అవకాశం ఉండగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండనుంది.

    ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అపరిమిత కాల్స్ ను పొందే అవకాశం ఉంటుంది. 179 రూపాయలు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా కేవలం 2జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అపరిమిత కాల్స్ ను పొందే అవకాశం ఉంటుంది. 18 నుంచి 54 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీకి అర్హులు. ఎటువంటి మెడికల్ టెస్ట్, పేపర్ వర్క్ లేకుండానే ఈ పాలసీని పొందవచ్చు.

    ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కోసం నామినీ రిజిష్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా సమీపంలోని ఎయిర్ టెల్ స్టోర్ ను సంప్రదించి కూడా నామినీ వివరాలను సబ్మిట్ చేయవచ్చు.