దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పత్తి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి క్వింటా గరిష్టం 8,080 రూపాయలు పలికింది. కిష్టప్ప అనే రైతు పండించిన పంటకు ఈ రేటు పలకడం గమనార్హం. ఖరీఫ్ సాగుకు ముందు రికార్డు స్థాయిలో పత్తి ధరలు ఉండటంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వ్యాపారుల మధ్య పోటీ వలే రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి.
దేశంలో ఏ ఇతర మార్కెట్ లో లేని స్థాయిలో ఆదోనిలో రికార్డు స్థాయిలో ధరలు నమోదవుతూ ఉండటం గమనార్హం. పరిశ్రమలకు అవసరమైన పత్తి లేకపోవడం, రైతుల వద్ద కొత్త దిగుబడుల నిల్వలు లేకపోవడం వల్ల వ్యాపారుల మధ్య పోటీ పెరిగి రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యాయని సమాచారం. మార్కెట్ లో పత్తి కనిష్ట ధర 6,509 రూపాయలు పలికింది. భారత పత్తి సంస్థ(సీసీఐ) మద్దతు ధర క్వింటాకు 5,725 రూపాయలుగా ఉంది.
సాధారణంగా ఈ సంస్థ ధర కంటే ప్రైవేట్ మార్కెట్‌లో ధర కొంతమేర తక్కువ పలుకుతుంది. పత్తి ధరలు ఊహించని స్థాయిలో పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి ధరలు భారీగా పెరగడం వల్ల రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోవడంతో పాటు రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. అయితే రాబోయే రోజుల్లో పత్తి ధరలు ఇదే విధంగా ఉంటాయో లేదో చూడాల్సి ఉంది.
సెపెటెంబర్ నెల నుంచి రైతులకు పత్తి పంట మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. వ్యాపారుల మధ్య పోటీ వల్ల రైతులకు మేలు జరుగుతుండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో పత్తి పంటను ఎక్కువగా పండిస్తారనే సంగతి తెలిసిందే.