Mutual Funds: మనలో చాలామంది చిన్న వయస్సులోనే ఎక్కువ డబ్బును సంపాదించాలని భావిస్తూ ఉంటారు. రిటైర్‌మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాగించాలని భావించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొంతమంది 45 సంవత్సరాల వయస్సులోనే రిటైర్‌మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా డబ్బు సంపాదించాలని భావించే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టడానికి సరైన పెట్టుబడి సాధనం కాగా తక్కువ వయస్సులోనే రిటైర్‌మెంట్ ప్లానింగ్ ను మొదలుపెడితే మంచిది. నెలకు కనీసం 30,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే 33 సంవత్సరాల తర్వాత ఇన్వెస్ట్ చేసిన డబ్బు కోటీ 20 లక్షల రూపాయలుగా ఉంటే దీనికి వడ్డీ, ఇతర బెనిఫిట్స్ కలిపి మొత్తం 7.4 కోట్ల రూపాయలు అవుతుంది.
Also Read: భీమ్లానాయక్ రాజకీయం.. కేసీఆర్ అలా.. జగన్ ఇలా.. ఏంటీ రచ్చ..?
భవిష్యత్తులో ఎక్కువ మొత్తంలో డబ్బును పొందాలని భావించే వాళ్లు వెంటనే పెన్షన్ పొందడం కోసం డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవసరాలకు అనుగుణంగా ఫండ్స్ ను ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఇబ్బందులు పడే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ గురించి సరైన అవగాహన లేకుండా మాత్రం ఇందులో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం సరికాదు. తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టినా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు.
Also Read: నియంతలా వ్యవహరిస్తున్న పుతిన్.. అగ్రరాజ్యాల హెచ్చరికలు బేఖాతరు
Recommended Video: