Homeబిజినెస్Aditi Avasthi: అంతటి అంబానీని మెప్పించింది: ₹1600 కోట్ల ఎడ్ టెక్ సామ్రాజ్యాన్ని విస్తరించింది

Aditi Avasthi: అంతటి అంబానీని మెప్పించింది: ₹1600 కోట్ల ఎడ్ టెక్ సామ్రాజ్యాన్ని విస్తరించింది

Aditi Avasthi: మహిళలంటే ఒకప్పుడు వంటింటి కుందేలు. కానీ ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్నారు. టోకు వర్తకం నుంచి చట్టసభల దాకా అన్నింట్లో తమదైన ముద్ర వేస్తున్నారు. 33% రిజర్వేషన్ అమలు కాలేదు కానీ.. అది అమలుకు నోచుకుంటే వారు ఏకంగా ఈ భారతదేశాన్ని ఏలేయగలరు. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో “పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించడం వారికి ఒక లెక్కా” అని ఒక డైలాగ్ అంటాడు కదా.. ఆ డైలాగు మాదిరే ఓ మహిళ ఎడ్ టెక్ వ్యాపారంలో దూసుకుపోతోంది. ఏకంగా 1600 కోట్ల కంపెనీగా తన సంస్థను నిలబెట్టింది. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది.

ఎడ్ టెక్ వ్యాపారంలో..

సాధారణంగా మనలో ఎడ్ టెక్ ప్రస్తావన వచ్చినప్పుడు ముందుగా మిగిలేది బైజూస్, ఫిజిక్స్ వాలా,అనకాడమీ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది ఎంబైబ్. అలాగని ఈ సంస్థ ఏర్పాటు చేసింది ఏ కార్పొరేట్ అధిపతో, లేక కాకలు తీరిన యోధులో కాదు..ఒక మహిళ దీనిని ప్రారంభించింది. అంతేకాదు 1600 కోట్ల వ్యవస్థగా మార్చేసింది. ఇంతకీ దీనిని ఏర్పాటు చేసిన మహిళ పేరు అదితి అవస్తీ. పుట్టింది పంజాబ్ లోని లూథియానాలో. 2003లో థాపర్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేసింది. చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఫైనాన్స్ మార్కెటింగ్ లో ఎంబీఏ పట్టా అందుకుంది. బీటెక్ పూర్తి చేసిన తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో కొద్ది రోజులపాటు పనిచేసింది..ఆ తర్వాత బార్కేస్ లో ఆఫ్రికాలోని మొబైల్ బ్యాంకింగ్ విభాగానికి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ప్రోడక్ట్ స్ట్రాటజీ హెడ్ గా పనిచేసింది.. అయితే ఇక్కడే ఆమెకు ఒక కత్తిలాంటి ఆలోచన వచ్చింది. అది ఏకంగా ఆమె గతినే మార్చేసింది.

ఎడ్ టెక్ కంపెనీ వైపు

మనదేశంలో ఇప్పటికీ సాంప్రదాయ విధానంలోనే పాఠాలు బోధిస్తారు. కాలానుగుణంగా విద్యా విధానంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ కోవిడ్ సమయంలో మాత్రమే ఆ మార్పులను కొత్త గొప్పో మన ప్రభుత్వాలు స్వీకరించగలిగాయి.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మార్పులను కూడా పక్కన పెట్టేసాయి.. అందువల్లే చాలావరకు ఎడ్ టెక్ కంపెనీలు నష్టాలను ప్రకటించాయి. అయితే ఇందులోనే లాభాలు వెతుక్కోవాలని ఆదితి అవస్తీ ఎంబైబ్ సంస్థను స్థాపించింది. 2012లో ఏంజెల్ ఇన్వెస్టర్స్ ఇచ్చిన ఏడు లక్షల డాలర్ల నిధులతో ఈ సంస్థను స్థాపించారు.. ఆ తర్వాత కళారీ క్యాపిటల్, లైట్ బాక్స్ వెంచర్స్ నుంచి కూడా పెట్టుబడులను సాధించారు. అయితే ఇవి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు సరిపోవని భావించిన అదితి ఏకంగా భారీ స్టెప్ వేశారు.

రిలయన్స్ పెట్టుబడులు

అయితే తన సంస్థ అభివృద్ధి కోసం భారీగా నిధులు కావలసిన అవసరం ఉండడంతో అదితి ఏకంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని కలిశారు. తన సంస్థలో పెట్టుబడులు పెట్టాలంటూ కోరారు. వాస్తవానికి పెట్టుబడులు పెట్టే విషయంలో ముఖేష్ అంబానీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. అదితి ఏం చెప్పిందో తెలియదు కానీ ఆయన పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నారు. 2018 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 180 మిలియన్ డాలర్ల సొమ్మును ఎం బైబ్ లో పెట్టుబడిగా పెట్టింది. అంతేకాదు 73% వాటా కొనుగోలు చేసింది. లాభాలు భారీగా రావడంతో 2020లో ఏకంగా 500 కోట్ల పెట్టుబడి పెట్టింది.. ఎప్పుడైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం బైబ్ లో పెట్టుబడులు పెట్టిందో అప్పుడే ఆ కంపెనీ రూపురేఖలు మారిపోయాయి. ఏకంగా దాని విలువ 1600 కోట్లకు చేరింది. ఇక ఈ అదితిని చాలా అవార్డులు వరించాయి. 2017లో బిబిసి టాప్ 100 మంది మహిళలలో స్థానం సాధించారు. 2018లో ఓగ్ ఆమెను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేసింది.

ఇదీ విలువ

ఎం బైబ్ నాలుగు రౌండ్లలో మొత్తం 1600 కోట్లకు పైగా నిధులు సేకరించింది. కంపెనీ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో నిధులు సమీకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్నో వెన్ క్యాపిటల్ తో సహా నాలుగు సంస్థలు ఎం బైబ్ కు నిధులు సమకూరుస్తున్నాయి. ఇక ఇటీవల ఈ సంస్థ గోవా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ గా అవతరించింది. ఆ రాష్ట్రంలో ఉన్న 594 పాఠశాలల్లో లక్ష మంది విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించనుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version