Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటికే విమానయాన రంగంలో ఇండిగో ఎయిర్ ఇండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా.. ఇప్పుడు అదానీ గ్రూప్ కూడా ఇందులోకి ప్రవేశించడంతో పోటీ నెలకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అదానీ గ్రూప్ విమానయాన రంగంలోకి రావడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయా?
గౌతమ్ అదానీ కి చెందిన ప్రధాని గ్రూప్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముంబైలోని రెండు ఎయిర్ పోర్టులను నిర్వహిస్తోంది. అలాగే ఆరు విమానాశ్రయాలను నిర్వహణలో భాగమైంది. ప్రస్తుతం విమానాశ్రయాల నిర్వహణ సంస్థలు ఎయిర్ లైన్స్ లో 10 శాతానికి మించి వాటాను కలిగి ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ ఈ పరిమితిని ఎత్తివేస్తే అదానీ గ్రూప్ నకు ప్రయోజనం కలిగి అవకాశం ఉంది.
ప్రస్తుత భారత విమానయాన రంగంలో ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ ప్రధానంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా అదా నీ గ్రూప్ ఈ రంగంలోకి వస్తే వాటికి పోటీ నెలకొనే అవకాశం ఉంది. కానీ కొందరి అభిప్రాయం ప్రకారం ఎక్కువ విమానాలు.. అనేక రూట్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అదా నీ గ్రూప్ ఈ రంగంలోకి ప్రవేశిస్తే ప్రయోజనాలే అని కొంతమంది అంటుండగా.. దానిని లాభదాయకంగా చేసుకోవడం మాత్రం కష్టతరమైన పని అని అంటున్నారు.
ఇప్పటివరకు పలు రంగాల్లో అదానీ గ్రూప్ విజయవంతంగా ముందుకు వెళుతుంది. కానీ విమానయాన రంగంలో మాత్రం గరిష్ట లాభాలు పొందడం సులభం కాదని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఇందులో భారీ పెట్టుబడులా అవసరం ఉంటుంది. విమానాల కొనుగోలు నుంచి, ఇంధనం, పైలెట్లు, సిబ్బంది, మార్గాల నిర్వహణ వంటి ఖర్చులు ఉంటాయి. అంతేకాకుండా డాలర్ తో రూపాయి మారకం విలువ మార్పుల కారణంగా కూడా వ్యయ భారం భరించాల్సి ఉంటుంది.
అయితే అదానీ గ్రూప్ విమానయాన రంగంలోకి వస్తుందని వార్తలు వస్తున్నా.. ఈ కంపెనీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడ లేదు. ఇది ఇలా ఉండగా ఎయిర్పోర్ట్ నిర్వాహకులను ఎయిర్లైన్స్ వ్యాపారం లోకి అనుమతిస్తే ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయని ఇండిగో సహా వ్యవస్థాపకుడు ఎండి రాహుల్ భాటియా పేర్కొన్నారు.





